Add Zee Business As A Preferred Source
App

Jr NTR: భార్య లక్ష్మీ ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ గొడవ.. తారస్థాయికి వాగ్వాదం

Published: Oct 11, 2024, 07:40 PM IST|Updated: Oct 11, 2024, 07:40 PM IST

Jr NTR Fight Wife Lakshmi Pranathi: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ 'దేవర'తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పెంచుకుంటూ యంగ్ టైగర్ జీవితంలో జరిగిన ఓ సంఘటన వైరల్‌గా మారింది. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో గొడవ పడ్డాడని.. తారస్థాయికి వివాదం వెళ్లిందని పుకార్లు వస్తున్నాయి.

NTR Fight With Wife 11/7

పాన్ వరల్డ్ స్టార్: తన నటనతో, డ్యాన్స్‌తో అందరినీ ఆకర్షించిన ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్టార్‌గా రాణిస్తున్నాడు.

NTR Fight With Wife 32/7

తర్వాతి సినిమా:  ‘దేవర’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో సింగిల్‌ పాన్‌ వరల్డ్‌ హిట్‌ కొట్టాడు. కేజీఎఫ్ ఫేమ్‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

NTR Fight With Wife 53/7

కుటుంబానికి ప్రాధాన్యం: అయితే ఎన్టీఆర్ సినిమాపరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబ జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. షూటింగులు లేకపోతే భార్యాపిల్లలతో కలిసి విదేశాలకు చెక్కేస్తారు.

NTR Fight With Wife 64/7

అమ్మమ్మ ఊరికి: భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్‌రామ్‌, భార్గవ్‌రామ్‌తో సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల తన తల్లి శాలినితో కలిసి అమ్మమ్మ ఊరు కుందాపూర్‌లోని దేవాలయాలకు ఎన్టీఆర్‌ తీసుకెళ్లారు.

NTR Fight With Wife 95/7

అందరిలాగే మేం: అయితే ఇటీవల ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరు భార్యాభర్తల్లాగే తాము గొడవపడతామని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ స్వయంగా ఓ సందర్భంలో తెలిపాడు. ప్రతి భార్యాభర్తల్లాగే తాము కూడా కొట్లాడుకుంటామని చెప్పి ఆసక్తి రేపారు.

NTR Fight With Wife 116/7

ఆ విషయంలో గొడవ: 'ఏసీ విషయంలో ప్రణతి, నేను గొడవ పడతాం. ఏసీ విషయంలో ప్రణతి రాజీ పడుతుంది. కానీ నేను అస్సలు రాజీపడను' అని ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తెలిపాడు.

NTR Fight With Wife 127/7

నేనే వంట చేస్తా: 'ప్రతి ఆదివారం నేనే వంట చేస్తా. వంట వండిన తర్వాత కుటుంబసభ్యులు అందరికీ వడ్డిస్తా' అని ఎన్టీఆర్‌ వివరించాడు. సినీ పరిశ్రమలో చక్కటి జోడీ అంటే లక్ష్మీప్రణతి, ఎన్టీఆర్‌ అనే పేరు ఉంది.