Kamakshi Bhaskarla Photos: తెలుగు ప్రేక్షకుల హృదయాలను.. తన నటనతోనే కాకుండా.. అందంతో కూడా.. ఆకట్టుకుంటున్న హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. తన అందమైన డ్రెస్సులతో సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ హీరోయిన్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ కుర్ర కారు మనసులను దోచేసుకుంటుంది.
జూన్ 18, 1995న హైదరాబాద్‌లో జన్మించిన కామాక్షి భాస్కర్ల తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. జాన్సీ, శైతాన్, మా ఊరి పోలిమేర వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ సినిమాలలోని తన నటనతో.. తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని తెచ్చిపెట్టుకుంది.
ముఖ్యంగా 2021లో విడుదలైన "మా ఊరి పోలిమేర" అనే తెలుగు థ్రిల్లర్ సినిమాతో కామాక్షి భాస్కర్ల.. మంచి పేరు తెచ్చుకునింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. డిస్నీ+ హాట్‌స్టార్ లో విడుదలై మంచి విజయం సాధించింది. బాలాదిత్య, సత్యం రాజేష్ వంటి ప్రముఖులు కూడా ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వచ్చిన ఆదరణతో.. 2023లో సీక్వెల్‌గా "మా ఊరి పోలిమేర 2" విడుదలైంది.
సోషల్ మీడియా వేదికగా క్రమంగా తన అందాన్ని, స్టైల్‌ను చూపిస్తూ కాంప్లిమెంట్స్ అందుకుంటున్న కామాక్షి, ఇటీవల పంచుకున్న ఫోటోలు అందరినీ ఆకర్షించాయి. కాగా తను నటించిన సినిమాలు అన్నిటిలో కూడా ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ హీరోయిన్.. తన సోషల్ మీడియాలో మాత్రం ఎంతో అందమైన మోదరన్ డ్రస్సులలో ఫోటోలు పంచుకొని అందరిని ఆకట్టుకుంటుంది.
ఈ ఫోటోలు ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నాయి. ఇలా సినిమాలతోనే కాకుండా..తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పంచుకున్న ఈ ఫోటోలతో కూడా.. కామాక్షి భాస్కర్ల తన అభిమానులను మరింత ఆకట్టుకుంది. అంతేకాకుండా ఏ సినిమా ప్రమోషన్‌కి హాజరైనా, ఏ సందర్భం అయినా, కామాక్షి తన పర్‌ఫెక్ట్ డ్రెస్‌తో అందర్నీ ఆకర్షించడంలో ఎక్కడ తదపడటం లేదు. ఆమె నటనతో పాటు ఫ్యాషన్‌లో కూడా కొత్త ట్రెండ్స్‌ను తీసుకొస్తోంది ఈ హీరోయిన్.
మరి త్వరలోనే మరిన్ని సినిమా ఆఫర్లు సంపాదించుకొని.. మరింత ఫేమస్ అవుతుందేమో వేచి చూడాలి.