Kuja Dosham: జాతకంలో కుజ దోషంతో బాధ పడుతున్నారా.. ? పెళ్లి ప్రయత్నాలు ఫలించడం లేదా ? అయితే ఇలా చేస్తే జాతకంలో కుజ దోష ప్రభావం తగ్గి మంచి ఫలితాలను అందుకుంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Kuja Dosham: ప్రతి వ్యక్తి జీవితంలో దాదాపు అందరు కుజ దోషంతో బాధపడుతుంటారు. అంతేకాదు చేస్తోన్నఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి కుజ దోషం అడ్డు తగులుతూ ఉంటుంది. అడ్డు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేక రత్నాలను ధారణ వల్ల మంచి ప్రయోజనాలు ఉండే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఇది మన జీవితంలో వచ్చే కష్టాలను కొంత మేరకు తగ్గించే అవకాశాలున్నాయి. పూర్తి స్థాయిలో మాత్రం తగ్గించలేవు. మన పూర్వ కర్మ జన్మ ఫలితం.. మనం చేసే కర్మల ఆధారంగామంచి ఫలితాలను అందుకుంటారని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.
రత్నాలలో పగడము కుజుడికి సంబంధించిన రత్నం. ఈ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో అన్ని అడ్డంకులు తొలిగి పోతాయి. అంతేకాదు ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. మనిషి ఆరోగ్యంగా.. శారీరకంగా.. మానసికంగా శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది.
పగడము ధరించే ముందు చేయవలసిన పూజాదికాలు.. నియమాలు.. జీవితంలో మంచి ఫలితాలను అందుకోవడానికి పగడపు ధరించే ముందు జ్యోతిష్యులు లేదా పండితుల సలహా తీసుకోండి. పగడాన్ని బంగారం లేదా రాగిలో ధరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.
ముఖ్యంగా ఈ రత్నాన్ని ఏదైనా మంచి శుభ ముహూర్తం ఉన్న మంగళవారం రోజునే ధరించాలి. పగడపు ఉంగరాన్ని ధరించే ముందు ఉంగరాన్ని పచ్చిపాలలో కానీ గంగా జలంలో ఉంచి అభిషేకించాలి.
-అంతేకాదు మంగళవారం రోజున హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పూజ చేసిన తర్వాత ఈ ఉంగరం ధరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.
పగడపు ఉంగరాన్ని ధరించే ముందు బాగా కడగి శుభ్రం చేసి తొడుక్కోవాలి. పగడపు ఉంగరాన్ని చేతి చూపుడు వేలికి కానీ.. ఉంగరం వేలుకు కానీ ధరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.
పగడుపు ఉంగరం ధరించడం వలన కలిగే ప్రయోజనాలు.. పగడాన్ని ధరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలిగే అవకాశాలున్నాయి. పగడం ధరించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
కెరీర్‌లో అడ్డంకులు తొలిగించడంలో పగడపు ఉంగరం దోహదం చేస్తోంది. పగడాన్ని ధరించడం వల్ల ఆ వ్యక్తి యెక్క శక్తి మరియు ఆత్మ విశ్వాసం పెరుగుతోంది.
పగడం ధరించిన ఉంగరం ధరించడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడంలో ప్రభావవంతంగా పరిగణించబడుతోంది. పగడపు ఉంగరం ధరించడం వల్ల ప్రతికూలత తొలిగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది