Lady Aghori: అన్నంలో మట్టి కల్పుకుని తిన్న లేడీ అఘోరీ.. వింతగా చూసిన ప్రజలు..

Aghori naga sadhu: లేడీ అఘోరీ ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఆమె మహా నంది నుంచి కర్నూల్ కు పాదయాత్రగా వచ్చింది. ఆమెను చూసేందుకు భక్తులు పొటెత్తినట్లు తెలుస్తొంది.

1 /6

తెలంగాణలో ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాం ధ్వంసం తర్వాత లేడీ అఘోరీ అక్కడకు వచ్చి పూజలు చేసింది. ఆ తర్వాత వేముల వాడ, కొండగట్టు ఆలయాలను దర్శించుకుంది.

2 /6

దీపావళి రోజున ఆత్మర్పాణం చేసుకుంటానని, సనాతర ధర్మం కాపాడుకోవడం కోసం ఎవరు ముందుకు రావడంలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అఘోరీని ఆమె గ్రామంలో హౌస్ అరెస్ట్ చేశారు.

3 /6

ఆ తర్వాత కర్ణాటక కేరళ బార్డర్ లో వదిలేసి వచ్చారు. అయితే.. ఏపీలో అఘోరీ కొన్నిరోజులుగా హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఆమెను ఒక టోల్ గేట్ వద్ద.. టోల్ గేట్ ఎంప్లాయ్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొవచ్చింది.  

4 /6

అంతే కాకుండా కాళ హస్తిలో ఆలయంలోపలికి వెళ్లనివ్వకపోతే.. ఆమె పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేసింది. దీంతో పోలీసులు ప్రత్యేకంగా దర్శనంచేయించి, రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్లేలా చేశారు. ఈ నేపథ్యంలో ఆమె కారుకు ప్రమాదం కూడా జరిగింది.

5 /6

అయితే.. లేడీ అఘోరీ పోలీసులు తొందర పాటు వల్ల తన కారుకు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆమె మహానంది నుంచి కర్నూల్ కు పాదయాత్రగా వచ్చినట్లు సమాచారం. అయితే.. అక్కడున్న వారు లేడీ అఘోరీని చూసేందుకు ఎగబడ్డారు.  

6 /6

అప్పుడు లేడీ అఘోరీ రోడ్డుపక్కన కూర్చుని.. భోజనం చేసింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఆమె నెల మీద అన్నం వేసుకుని దానిలో పప్పు, కూర కల్పుకుని, మట్టి కూడా కలిపి మరీ తినేసింది. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలుస్తొంది. మనం తినేది మట్టిలో నుంచి వస్తోంది.. చివరకు మట్టిలోనే కలిసిపోతామన్న సందేశంను లేడీ అఘోరీ ఇచ్చినట్లు తెలుస్తొంది.