LIC Scholarship Scheme: ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు ఎల్ ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ స్కీమ్ 2024 అనే స్కీమును ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్ షిప్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి అర్హతలు ఉండాలి. చివరి తేదీ ఎప్పుడు ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.
LIC Scholarship Scheme: ఆర్థికంగా వెనబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ స్కీమ్ 2024 అనే స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీములో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎల్ఐసీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, గడువు తేదీ వివరాలను తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా లేదా తత్సమాన విద్యను కంప్లీట్ చేసి ఉండాలి. గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం 60శాతం మార్కులు లేదా సీజీపీఏ సాధించాలి. 2024-25లో ఉన్నత విద్య మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, వెకేషనల్ కోర్సులు, ఐటీఐ చదవడానికి అసక్తి ఉన్న విద్యార్థులు ఈ స్కీముకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రత్యేక గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ స్కీమ్ కింద అప్లయ్ చేసుకునే విద్యార్థినులకు రెండేళ్లపాటు స్కాలర్ షిప్ అందుతుంది. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్ , 10+2లేదా ఏదైనా డిప్లొమా కోర్సు చదివేందుకు అర్హులై ఉండాలి.
ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ www.licindia.in ద్వారా ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు గడువు డిసెంబర్ 22, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు డిసెంబర్ 8, 2024 నుంచి ప్రారంభం అవుతుంది.
కుటుంబ వార్షిక ఆదాయం, స్కాలర్ షిప్ పొందేందుకు మొత్తానికి సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎల్ఐసీ వెబ్ సైట్ ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ స్కీము ద్వారా ఎల్ఐసీ ప్రతిభావంతులైన విద్యార్థుల కలలు సాకారం చేసే ప్రయత్నాన్ని చేస్తోంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే అన్ని వివరాలు సరిగ్గా తెలసుకుని దరఖాస్తు చేసుకోండి.