Lizard Falling: బొడ్డు మీద బల్లి పడితే లక్ష్మీ కటాక్షమే.. వజ్రాలు, బంగారం మీ సొంతం

Lizard Falling On Navel What Happened: హిందూవులు బల్లిని కొన్నిసార్లు శుభప్రదమైనదని.. మరికొన్ని అశుభంగా భావిస్తుంటారు. బల్లి పలికితే సత్యం పలికిందని చెబుతుండగా.. అదే బల్లి శరీరంపై పడితే భయపడుతారు. శరీరంలో ఒక్కో చోట బల్లి పడడం శాపం.. కొన్నిచోట్ల లాభం ఉంది. బల్లి శాస్త్రం ఇలా ఉంది. తెలుసుకోండి.

1 /9

బల్లి శాస్త్రం: బల్లి శరీరంపై పడిన చోటను బట్టి శుభం జరుగుతాయి.. కొన్ని కీడు కూడా జరుగుతాయనే నమ్మకాలు హిందూవుల్లో ఉన్నాయి.

2 /9

శరీరంపై బల్లిపడటం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బల్లిని శుభప్రదంగా భావిస్తారు. బల్లి శరీరంపై పడడంపై బల్లిశాస్త్రం ఇలా చెబుతోంది.

3 /9

తలపై: తలపై బల్లి పడితే చెడు శకునాన్ని సూచిస్తుంది. తలపై పడితే చెడు సమయం ఎదుర్కోంటారని హెచ్చరికలాంటిది. తలపై బల్లి పడితే ఒక వ్యక్తి బంధువు లేదా తెలిసిన వ్యక్తి చనిపోవచ్చు. మనశ్శాంతిని కోల్పోవచ్చు.

4 /9

నుదుటిపై: బల్లి పడటం నుదుటిపై పడడం శుభసూచకంగా భావిస్తారు. నుదుటిపై ఎడమవైపు పడితే కీర్తి.. కుడి నుదుటిపై పడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ముఖం మీద బల్లి పడితే ఇంటికి బంధువులు వస్తారని అంటారు.

5 /9

కనుబొమ్మలపై: బల్లి కనుబొమ్మలపై పడితే కార్యాలయంలోని అధికారులు మీకు సహాయం అందిస్తారు. బల్లి కళ్లపై పడితే వారికి గండం ఉన్నట్టు భౄవించారు. ఎడమ చేతిపై లేదా ఎడమ కాలుపై బల్లి పడితే ఆ రోజంతా మంచి జరుగుతుందని నమ్మకం.

6 /9

కుడి చేయి.. కాలు: కుడి చేయి, కుడి కాలుపై బల్లి పడితే ఆ రోజు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాదాలపై పడితే విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుందని నమ్మకం. నాభి (బొడ్డు) ప్రాంతంలో బల్లి పడితే బంగారం.. వజ్రాలు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం.

7 /9

కుడి పాదం: బల్లి కుడి పాదంపై పడితే అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. ఎడమ కాలు మీద బల్లి పడితే ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. ఒడిలో బల్లి పడితే మీ తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి.

8 /9

కుడి ఛాతీ: బల్లి కుడి ఛాతీపై పడితే మేలు జరుగుతుంది. ఎడమ ఛాతీపై బల్లి పడితే ఆనందం.. మెడలో ఎడమవైపు పడితే వ్యాపారంలో విజయం.. కుడి వైపు పడితే బంధువు లేదా ఇతర వ్యక్తితో శత్రుత్వం వస్తుందనే నమ్మకాలు ఉన్నాయి.

9 /9

ఏం చేయాలి?: శరీరంపై బల్లి పడితే వెంటనే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇంట్లో కానీ సమీపంలోని ఆలయానికి వెళ్లి ఏ దేవుడినైనా దర్శనం చేసుకోవాలి. బల్లితో ఎలాంటి అశుభాలు.. కష్టాలు రాకుండా దేవుడిని ప్రార్థించాలి.