Low Price Car: తక్కువ బడ్జెట్‌లో సూపర్ ఫీచర్లతో హ్యుందాయ్ కారు.. ధర ఎంతంటే..?

Hyundai Exter Features: కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో హ్యుందాయ్ మోటార్ కారు రాబోతుంది. తక్కువ బడ్జెట్‌లో కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా చిన్న SUVని విడుదల చేయబోతోంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఇంటీరియర్ చిత్రాలను కంపెనీ షేర్ చేసింది. ఈ కారు లుకింగ్ పరంగా అద్భుతంగా ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్‌లకు పోటీగా రానుంది.
 

  • Jun 17, 2023, 23:26 PM IST
1 /7

హ్యుందాయ్ ఇండియా త్వరలో మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న మైక్రో-ఎస్‌యూవీ ఎక్స్‌టర్ ఫోటోలను షేర్ చేసింది. ఈ కారును జులై 10న భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. హ్యుందాయ్ కొత్త ఎక్స్‌టర్ ఎస్‌యూవీతో సెగ్మెంట్ లీడర్ టాటాతో పోటీ పడేందుకు రెడీ అవుతోంది.   

2 /7

కొత్తగా రానున్న మైక్రో-ఎస్‌వీయూ ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేందుకు డిజైన్ చేశారు. ఇందులో సన్‌రూఫ్‌తోపాటు పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.

3 /7

హ్యుందాయ్ ఎక్స్‌టార్‌లో 60 కంటే ఎక్కువ కనెక్ట్ చేసిన ఫీచర్‌లు అందుబాటులో ఉంటాయి. ఇందులో SUVలలో ఇది ఒకటి. కనెక్ట్ చేసిన 8-అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్, 4.2-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది ఆండ్రాయిట్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఇంటర్నల్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది.  

4 /7

ఎంఐడీ డ్రైవ్, టీఎంపీఎస్, పార్కింగ్ అసిస్ట్ వంటి అనేక అధునాతన ఫీచర్లు Xeter లోపల అందుబాటులో ఉంటాయి. హ్యుందాయ్ ఎక్స్‌టార్‌లో 90 కంటే ఎక్కువ పొందుపరిచిన వాయిస్ కమాండ్‌లు కూడా ఉన్నాయి. ఇవి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా కూడా పని చేస్తాయి. 

5 /7

ఎక్సెటర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్‌ను పొందుతుంది. ఇది 83 పీఎస్ పవర్, 114 ఎన్‌ఎమ్‌ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీతో జత చేసి ఉంటుంది.  

6 /7

ఎక్సెటర్‌లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఐచ్ఛిక సీఎన్‌జీ కిట్ కూడా అందుబాటులో ఉంది. సీఎన్‌జీ వేరియంట్‌లో ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే జత చేసి ఉంటుంది. అయితే అవుట్‌పుట్ ఫిగర్ తక్కువగా ఉంటుంది.  

7 /7

ఇది 5 సీటర్ మైక్రో SUV. ధర రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మీరు EX, S, SX, SX (O), SX (O) Connect ఆప్షన్‌తో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను ఐదు వేరియంట్‌లలో బుక్ చేసుకోవచ్చు.