Manchu Lakshmi: ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు? మంచు లక్ష్మి మరో సంచలన పోస్ట్‌.. ఎవరికోసం?

Manchu Lakshmi Sensational Post: మంచు వార్‌ కొనసాగుతూనే ఉంది. ఆస్తి విషయంలో మంచు మోహన బాబు, మనోజ్‌ గొడవపడుతున్న సంగతి తెలిసిందే. నిన్న రాచకొండ సీపీ కూడా మంచు విష్ణుకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వీరి వద్ద నుంచి గన్స్‌ కూడా సరెండర్‌ చేసుకున్నారు. మనోజ్‌ నుంచి లక్ష బాండ్‌ కూడా తీసుకున్నారు. అయితే, మంచు లక్ష్మి పెట్టిన మరో పోస్ట్‌ వైరల్‌ అవుతుంది..
 

1 /5

మంచువారి చిచ్చ ఇంకా ఆగలేదు. తాజాగా మోహన్‌ బాబు పై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు కూడా నమోదు చేశారు పహాడి షరిఫ్‌ పోలీసులు. రిపోర్టర్‌ దాడి చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.  

2 /5

మోహన్‌ బాబు, మనోజ్‌కు మధ్య ఈ వివాదం కొనసాగుతుంది. నిన్న ప్రెస్‌ మీట్‌ పెట్టి అన్ని విషయాలు బయటకు చెబుతా అన్న మంచు మనోజ్‌ చివరికి కేన్సల్‌ చేసుకున్నారు.  

3 /5

ఈ నేపథ్యలో మంచు లక్ష్మి నిన్న ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోను షేర్‌ చేశారు. దీనిపై నెట్టిజెన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదర్చకుండా  ఈ పోస్టులు ఏంటి ?అని కామెంట్లు పెట్టారు.  

4 /5

తాజాగా మరోసారి మంచు లక్ష్మి ఎక్స్‌ వేధికగా పోస్ట్‌ పెట్టారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఈ పోస్టులో మంచు లక్ష్మి ' ఏదీ ఈ లోకంలో నీది కాదు.. అలాంటప్పుడు ఏదో కోల్పోతావనే భయం ఎందుకు?' అని పోస్ట్‌ పెట్టారు.  

5 /5

అయితే, సోషల్‌ మీడియాలో ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్‌ పెట్టారు? అని నెట్టిజెన్లు జుట్టు పీక్కుంటున్నారు. మోహన్‌ బాబు, మంచు విష్ణు, మనోజ్‌ ఎవరిని ఉద్దేశించి పెట్టింది అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.