Maoists Attack: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి గ్రామస్థుల దారుణ హత్య...

Maoists Killed Two Villagers: ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌ఫార్మర్ల నెపంతో అర్ధరాత్రి ఇద్దరు గ్రామస్థులను అత్యంత దారుణంగా హత్య చేశారు మావోలు. దీంతో ఒక్కసారిగా ములుగు జిల్లా ఉలిక్కిపడింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

తెలంగాణ ములుగు జిల్లాలో దారుణ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు.  

2 /5

పెనుగోలు కాలనీ పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఉయిక రమేష్‌, అర్జున్‌ అనే ఇద్దరిని అర్ధరాత్రి అత్యంత దారుణంగా మావోలు హత్య చేశారు.  

3 /5

హత్య చేసిన తర్వాత వారి మృతదేహాల వద్ద లేఖ వదిలి వెళ్లారు మావోయిస్టులు. పలుమార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో హతమార్చినట్లు మావోలు రాసిపెట్టారు.  

4 /5

ఈ మావోయిస్టుల దుశ్చర్యతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాలను కూడా అలెర్ట్‌ అయ్యారు పోలీసులు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.  

5 /5

ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పని ఎవరు చేశారా? అని పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గతంలో మావోయిస్టులతో పనిచేసిన వారిపై కూడా నిఘా పెంచారు.