May 9 Tollywood Lucky Day: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని డేట్స్ ప్రత్యేకమైనవి. ఆ రోజు విడుదలైన సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అందులో మే 9 ప్రత్యేకమైనది. ఈ రోజు విడుదలైన జగదేవవీరుడు అతిలోకససుందరి, గ్యాంగ్ లీడర్, సంతోషం, ప్రేమించుకుందాం రా, మహర్షి, మహానటి, భారతీయుడు వంటి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి.
మహర్షి Maharshi (2019 May 9) మహేష్ బాబు హీరోగా అల్లరి నరేష్ మరో ప్రధాన పాత్రలో నటించిన మూవీ మహర్షి. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీ 2019 మే 9న విడుదలై సంచలన విజయం సాధించింది.మొత్తంగా వివిధ ఇయర్స్‌లో మే9 విడుదలైన చిత్రాల్లో ఎక్కువ మటుకు బ్లాక్ బస్టర్స్ గా నిలిచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మైల్ స్టోన్‌గా నిలిచాయి.
మహానటి.. Mahanati ( 2008 May 9) నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన మూవీ మహానటి. కీర్తి సురేష్ లీడ్ హీరోయిన్గా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మూవీ 2008 మే 9న విడుదలైన సంచలన విజయం సాధించింది.
సంతోషం.. Santhosham ( 2002 May 9) దశరథ్ దర్శకత్వంలో నాగార్జున, శ్రియ, గ్రేసీ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ సంతోషం. ఈ సినిమా 2002 మే 9న సంచలన విజయం సాధించింది.
ప్రేమించుకుందాం.. రా.. Preminchukundam Raa (1997 May 9) వెంకటేష్, అంజలా ఝవేరి హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ ప్రేమించుకుందాం.. రా మూవీ. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ 1997 మే 9న విడుదలై సంచలన విజయం సాధించింది.
భారతీయుడు.. Bharatheeyudu (1996 May 9) కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో మనీషా కొయిరాల, ఊర్మిళ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా భారతీయుడు. ఈ సినిమా 1996 మే 9 న విడుదలై సంచలన విజయం సాధించింది.
గ్యాంగ్ లీడర్ - Gang Leader (1991 May 9) విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన మూవీ గ్యాంగ్ లీడర్. ఈ సినిమా 1991 మే 9 విడుదలైన చిరు కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
జగదేకవీరుడు అతిలోకసుందరి - Jagadeka veerudu Athiloka Sundari (1990 May 9) చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీదత్ నిర్మాణంలో కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న విడుదలైన ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మొత్తంగా వివిధ ఇయర్స్‌లో మే9 విడుదలైన చిత్రాల్లో ఎక్కువ మటుకు బ్లాక్ బస్టర్స్ గా నిలిచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మైల్ స్టోన్‌గా నిలిచాయి.