Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో "మెలోడి'' మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..


G7 summit: ఇటీవల మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సుకు హజరవ్వడానికి ఇటలీలోని అపులియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జీ 7 దేశాలతో జరిగిన సమ్మిట్ లో సభ్యదేశాలతో పలు అంశాలపై చర్చించారు. 

1 /6

నరేంద్ర మోదీ ఇటీవల మన దేశానికి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ 3.0 అంటూ తన మార్కు చూపిస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారినికి హజరైన మోదీ.. మరల  జీ7 సదస్సుకు హజరయ్యేందుకు వెళ్లారు.  

2 /6

మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి విదేశీ పర్యటనకు ఇటలీకి వెళ్లారు. అది కూడా ఆయన జీ7 సమ్మిట్ కు హజరవ్వడానికి వెళ్లడంతో అది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో మోదీ జీ 7 సదస్సులోని సభ్యదేశాలతో జరిగిన సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

3 /6

ఇక మోదీ.. ఇటలీ  ప్రధాని జార్జియా మెలోనితో కలిసి దిగిన సెల్పీలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. గతంలో కూడా వీరిద్దరు కాప్28 సదస్సులో ఇదే విధంగా సెల్ఫీలు దిగారు.

4 /6

ఈ నేపథ్యంలో సరదాగా.. మెలోనీ... మోదీతో సెల్ఫీ దిగి.. ఎక్స్ ఖాతాలో.. హయ్ ఫ్రెండ్స్.. ఫ్రమ్ మోలోడీ అంటూ క్యాప్షన్ జతచేశారు. దీంతో ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది.

5 /6

గతేడాది కూడా మోదీ.. దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సమ్మిట్ లో పాల్గొన్నారు. అప్పుడు కూడా వీరిద్దరు సెల్ఫీలు దిగి తమ ఖాతాలో పోస్టు చేశారు. దానికి మెలోడి వచ్చేలా.. హ్యష్ ట్యాగ్ జతచేశారు.

6 /6

ఇదిలా ఉండగా.. ఈ ఫోటోపై మోదీ స్పందిస్తు.. స్నేహితుల్ని కలుసుకొవడం ఎంతో ఆనందంగా ఉందంటూ రిప్లై ఇచ్చారు. జీ 7 సదస్సులో అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాల అధినేతలు హజరయ్యారు. మోదీ ఇటీవల హ్యట్రిక్ పీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయా దేశాధినేతలు మోదీకి స్పెషల్ విషేస్ చెప్పారు.