Menthikura Pappu: మెంతికూర పప్పు ఇలా చేస్తే.. మెతుకు మిగుల్చకుండా తింటారు..

Menthikura Pappu Recipe: మెంతికూర ఎంతో రుచిగా  ఉంటుంది. దీంతో తయారు చేసిన ఏ కూర రిసిపీ అయినా అదిరిపోవాల్సిందే. మెంతికూరలో చిన్నది, పెద్దది రెండు రకాలు ఉంటాయి. అయితే, రుచికరమైన మెంతికూర పప్పు రిసిపీ ఇలా ట్రై చేశారంటే రుచి అదిరిపోవాల్సిందే..
 

1 /5

కావాల్సిన పదార్థాలు.. తాజా మెంతికూర-2 శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, కందిపప్పు -200 గ్రాములు తీసుకుని స్టవ్‌ ఆన్‌ చేసి ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో కొద్దిగా పుసుపు, నూనె వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

2 /5

మరోవైపు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ సన్న తరగాలి. టమోటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు సగం ఉడికిన పప్పులో ఉల్లిపాయలు వేసుకోవాలి. టమోటాలు, వెల్లల్లి, జిలకర్ర వేసి మూత పెట్టుకోవాలి.  

3 /5

పప్పు 80 శాతం ఉడికిన తర్వాత మెంతి కూర వేసుకోవాలి. దీంతో బీపీ, షుగర్‌ కంట్రోల్‌ ఉంటుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచా కారం వేసుకుని బాగా కలపాలి.  

4 /5

ఓ ఐదు నిమిషాలు పప్పు బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం, కొత్తిమీర కూడా వేసుకని బాగా కలపాలి.  ఇప్పుడు పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.  

5 /5

ఇప్పుడు తాలింపునకు నూనె కడాయిలో వేసి ఆవాలు, జిలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు కూడా వేసి తాలింపు వేయాలి. దీన్ని పప్పులో వేసుకుంటే రుచికరమైన మెంతికూర పప్పు రెడీ.