MI Vs RCB Highlights 2023: సూర్య సూపర్ ఇన్నింగ్స్.. ఐపీఎల్‌లో చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం

Suryakumar Yadav IPL Runs: ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంది. మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. అనంతరం ముంబై 4 వికెట్ట్ కోల్పోయి కేవలం 16.3 ఓవర్లలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (83) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు నేహాల్ వధేరా (52), ఇషాన్ కిషన్ (42) ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. 
 

1 /6

ఈ సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. ముంబైపై మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో 4 బంతుల్లో కేవలం ఒక పరుగు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.   

2 /6

కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్ మరోసారి ఆర్‌సీబీని గట్టెక్కించారు.‌ వీరిద్దరి దూకుడుతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. డుప్లెసిస్ 65 పరుగులు చేయగా.. మాక్స్‌వెల్ 68 రన్స్ చేశాడు. చివర్లో దినేష్ కార్తీక్ 30 రన్స్‌తో దూకుడుగా ఆడాడు.   

3 /6

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తన ఫామ్‌ను కొనసాగించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.   

4 /6

నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వరుస అర్ధ సెంచరీలతో చెలరేగుతున్నాడు. బెంగుళూరుపై కేవలం 35 బంతుల్లో 83 పరుగులు చేసి ముంబైను గెలిపించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 3 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. సూర్య 11 మ్యాచ్‌ల్లో 376 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చాడు.   

5 /6

ఒకే సీజన్‌లో 200 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని అత్యధికసార్లు ఛేదించిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ సీజన్‌లో మూడుసార్లు 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేజ్ చేశారు.    

6 /6

మరో 21 బంతులు ఉండగానే ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. 200+ పరుగుల ఛేజింగ్‌లో ఇదే అతిపెద్ద విజయం. కేవలం 16.3 ఓవర్లలోనే ముంబై జట్టు 200 పరుగుల టార్గెట్‌ను పూర్తిచేసింది.