Mrunal Thakur Interview: సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగులో రెండు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ కెరియర్లో ఒక రేంజ్ లో బిజీ అయిపోయిన మృణాల్ ఠాకూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ప్రేమ కథల గురించి బయట పెట్టింది. ఒక వ్యక్తితో డేటింగ్ చేశానని చెప్పిన మృణాల్.. అతనితో ఎందుకు బ్రేకప్ అయిందో కూడా చెప్పుకొచ్చింది.
సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయం అయిన మృణాల్ ఠాకూర్.. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను ఏర్పరచుకుంది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో.. మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మృణాల్ ఠాకూర్.. ఫ్యామిలీ స్టార్ సినిమాతో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే అన్ని భాషల నుంచి మృణాల్ ఠాకూర్ కి బోలెడు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. వరుస సినిమాలతో ఈ భామ బిజీ అయిపోయింది. అయితే తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ ఈ భామ.. తన ప్రేమ కథల గురించి చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రేమ కథ గురించి మాత్రమే కాకుండా బ్రేకప్ కారణాలు గురించి కూడా బయట పెట్టింది మృణాల్ ఠాకూర్.
"మనకు సెట్ అయ్యే వ్యక్తి మన జీవితంలోకి వచ్చేవరకు.. వచ్చి వెళ్లిపోయే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అప్పుడే మనకి ఎవరు సెట్ అవుతారు అని తెలుస్తుంది. నా లైఫ్ లో కూడా నేను ఒకరితో డేటింగ్ చేశాను. కానీ ఒక హీరోయిన్ తో రిలేషన్షిప్ అతనికి నచ్చలేదు. తను ఒక పద్ధతి కల కుటుంబం నుంచి వచ్చాను అని చెప్పాడు. దాంతో ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నాము. ఆ విషయంలో అతని తప్పులేదు. అతను పెరిగిన విధానం.. నేను పెరిగిన విధానం చాలా డిఫరెంట్. మేము విడిపోవడమే మంచిది. లేకపోతే మా పిల్లల పెంపకం విషయంలో కూడా.. మా విధానాలు వేరుగా ఉంటాయి. అప్పుడు పుట్టిన పిల్లలకి ఏమీ అర్థం కాదు" అని నవ్వేసింది మృణాల్.
అంతేకాకుండా ఏడు నెలల క్రితం కూడా ఒక బ్రేకప్ అయ్యింది అంటూ.. మరొక ప్రేమ కథ గురించి కూడా బయట పెట్టేసింది మృణాల్ ఠాకూర్. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. మనిషి అందంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ.. మంచి గుణం మాత్రం ఉండాలి అని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.
ఇక సినిమాల పరంగా చూస్తే మృణాల్ చేతిలో పలు హిందీ సినిమాలు ఉన్నాయి. తెలుగులో కంటే బాలీవుడ్ లో ఎక్కువగా స్థిరపడటానికి.. మృణాల్ ఠాకూర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఈమె తెలుగు సినిమాతో వెండితెర మీద ఎప్పుడు కనిపిస్తుందో అని.. ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.