Mukesh Ambani House Latest Images: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ 'ఆంటిలియా' భవనం కూడా ఒకటి. దక్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్ ప్రాంతంలో ఈ భవనం ఉంటుంది. ఈ భవనం సకల సౌకర్యాలతో ఇంద్ర భవనం తలపించే విధంగా ఉంటుంది. 27 అంతస్తుల్లో ఆంటిలియా భవనాన్ని నిర్మించారు. అయితే ఇంత పెద్ద ప్యాలెస్‌లో అంబానీ పెద్ద కొడుకు, కోడలు చివరి అంతస్తులోనే ఉంటారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..
ఆంటిలియా భవన నిర్మాణం కోసం ముఖేష్ అంబానీ భారీగా ఖర్చు చేశారు. 400,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 570 అడుగుల ఎత్తులో ఉన్న ఈ భవనం నిర్మాణ వ్యయం రూ.15 వేల కోట్లు.
ఆంటిలియా అని పేరు పెట్టేందుకు ముఖేష్ అంబానీ చాలానే రీసెర్చ్ చేయించారు. పౌరాణిక ద్వీపం 'ఆంటె-ల్లా' పేరు మీదుగా ఆంటిలియా అని నామకరణం చేశారు.
ఈ భవనం నిర్మాణాన్ని 2006లో ఆస్ట్రేలియాకు చెందిన లైటన్ ఆసియా కంపెనీ మొదలు పెట్టగా.. 2010లో BE బిల్లిమోరియా అండ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ కంప్లీట్ చేసింది.
ముఖేష్ అంబానీ 26, 27వ అంతస్తుల్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫ్లోర్స్‌లోని అన్ని గదులకు వెంటిలేషన్ చక్కగా ఉండడంతోపాటు సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది.
నవంబర్ 2010లో ఆంటిలియా ఓపెనింగ్ సెర్మనీ చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసంగా ఆంటిలియా భవనం పేరుగాంచింది. దీనిని 'గ్రీన్ టవర్ ఆఫ్ ముంబై' అని కూడా అంటారు.
భారీ భూకంపాలను సైతం ఆంటిలియా భవనం తట్టుకోగలదు. మూడు హెలిప్యాడ్స్, 49 విలావంతమైన బెడ్‌రూమ్‌లు, 168 కార్ల పార్కింగ్ స్పెస్, 50 సీట్ల థియేటర్, టెంపుల్ ఇలా సకల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.