Add Zee Business As A Preferred Source
App

Nayanthara: రెచ్చిపోయిన నయనతార.. భర్త విఘ్నేష్ శివన్‌కి ముద్దులతో స్పెషల్ ట్రీట్.. వైరల్ గా మారిన పిక్స్.

Written ByInamdar Paresh
Published: Sep 18, 2024, 03:38 PM IST|Updated: Sep 18, 2024, 03:41 PM IST

Nayanthara kisses vignesh shivan: నయన తార తన భర్త విఘ్నేష్ శివన్‌కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు విఘ్నేష్ శివన్‌ బర్త్ డే సందర్భంగా  ప్రత్యేకంగా ముద్దులు పెట్టి మరీతన ప్రేమను పంచుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 

Nayanthara kisses vignesh shivan: 1/7

నయనతార విఘ్నేష్ శివన్‌:

లేడీ హీరోయిన్ నయనతార.. తన భర్త విఘ్నేష్ శివన్‌కి ఈ రోజు.. సెప్టెంబర్ 18 న..39 వ వడిలోకి అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో నయనతార స్పెషల్ గా బర్త్ డే వేడుకల్ని నిర్వహించారు.  ఈ నేపథ్యంలో ఈ స్వీట్ కపుల్.. ఒక రెస్టారెంట్ లో ముద్దులు పెట్టుకున్న పిక్స్ లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Nayanthara kisses vignesh shivan: 2/7

నయనతార విఘ్నేష్ శివన్‌:

నయనతార ఎక్స్ లో తన భర్తతో రొమాంటిక్ ఫోటోలను పోస్ట్ చేసి.. హ్యాపీ బర్త్ డే  మై ఎవ్రీథింగ్ అంటూ కూడా కామెంట్ జతచేశారు.. నీ లైఫ్ లో నువ్వుకొరుకున్నది ప్రతి  ఒక్కటి జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఎంతో ప్రేమిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. వీరిద్దరు పబ్లిక్ గా ఒకర్నిమరోకరు ముద్దులు పెట్టుకున్నారు.

Nayanthara kisses vignesh shivan: 3/7

నయనతార విఘ్నేష్ శివన్‌:

ఇదిలా ఉండగా.. నేనూ రౌడీనే.. సినిమా వర్క్ చేస్తుండగా.. నయనతార ,విఘ్నేష్ శివన్‌ ల మధ్య పరిచయం ఏర్పడింది.  వీరిద్ద కూడా దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంలో.. 2022 జూన్ 9న  పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Nayanthara kisses vignesh shivan: 4/7

నయనతార విఘ్నేష్ శివన్‌:

చెన్నై సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకి బాలీవుడ్ నటి నటులు పెద్ద ఎత్తున హజరయ్యారు. ఈ నేపథ్యలో వీరిద్దరు కూడా.. . 2022 అక్టోబర్‌లో సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగ్ అనే కవల పిల్లలకి ఈ జంట తల్లిదండ్రులయ్యారు. నయనతార ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంటున్నారు. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ దర్శకత్వంలో డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తోంది

Nayanthara kisses vignesh shivan: 5/7

నయనతార విఘ్నేష్ శివన్‌:

నయనతార చివరిసారిగా..  2022లో వచ్చిన గోల్డ్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించింది. గత ఏడాది షారుఖ్ ఖాన్ సరసన జవాన్ మూవీతో బాలీవుడ్‌లోకి కూడా నయనతారం ఎంట్రీ ఇచ్చింది. కానీ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకి మాత్రం నయనతార దూరంగా ఉంటు, ఫ్యామిలీతో బిజీగా ఉంటున్నారు.

Nayanthara kisses vignesh shivan: 6/7

నయనతార విఘ్నేష్ శివన్‌:

ప్రస్తుతం నయనతార తన భర్త.. విఘ్నేష్ శివన్ లతో కలిసి.. రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో..  బర్త్ డే డిన్నర్‌కు సంబంధించిన ఫోటోలను నయనతార తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. డిన్నర్ ఫొటోల్లో నయనతార, విఘ్నేష్ ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు.

Nayanthara kisses vignesh shivan: 7/7

నయనతార విఘ్నేష్ శివన్‌:

నయన్ ఆలివ్ గ్రీన్ జాకెట్ కింద బ్లాక్ టాప్ వేసుకుంది.. విఘ్నేష్ బ్లాక్ టీ షర్ట్ ధరించాడు. పక్కపక్కనే కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ ఒకరిపై మరోకరికి గల తమ ప్రేమను ముద్దులతో చాటుకున్నారు. ఈ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. నెటిజన్ లు.. విఘ్నేష్ శివన్ కు ప్రత్యేకంగా బర్త్ డే విషేస్ చెప్తున్నారు.