Neha Shetty: నేహా శెట్టి వయ్యారాలు చూడతరామా.. లేటెస్ట్ ఫోటోస్ చూస్తే చూపు తిప్పుకోలేరు..

Neha Shetty | నేహా శెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలో  వినిపిస్తోన్న పేరు. కానీ కథానాయికగా ఇప్పటికీ పెద్ద రేంజ్‌కు మాత్రం ఎదగలేదనే చెప్పాలి. ఇక డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ మధ్య ‘బెదురులంక’ సినిమాతో పలకరించినా.. ఈమె కెరీర్ పెద్దగా ఉపయోగపడింది లేదనే చెప్పాలి.  తాజాగా టిల్లు స్వ్కేర్ మూవీలో రాధికగా కాసేపు అలా మెరిసింది. చేతిలో సినిమాలున్నా.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్‌తో అలరిస్తోంది.

1 /6

శాండిల్ వుడ్ భామ అయిన నేహా శెట్టి.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెరంగేట్రం చేసింది.  

2 /6

  నేహా శెట్టి తన సొంత భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో  కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.

3 /6

ఆ తర్వాత 'గల్లీ రౌడీ' సినిమాతో పలకరించింది నేహా. అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో నటించింది.

4 /6

ఇక సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పేరు పాపులర్ అయింది.  ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీల్లో మెరిసింది.  తాజాగా మరోసారి 'టిల్లు స్క్వేర్' మూవీతో ప్రేక్షకులను కాసేపు అలా పలకరించి వెళ్లింది.

5 /6

డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన గ్లామర్ షోతో  సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

6 /6

ప్రెజెంట్ నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో యాక్ట్ చేస్తోంది.  ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.