Nostradamus: ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్ అంచనా వేసి చెప్పగలిగే జ్యోతిష్యులు చాలామంది ఉన్నారు. చాలామంది చెప్పిన అంచనాలు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి. ఫ్రాన్స్ దేశానికి చెందిన నోస్ట్రాడామస్ వీరిలో ఒకరు. ఇప్పుడు నడుస్తున్న వర్తమానం, రానున్న భవిష్యత్ గురించి ఆయన తన పుస్తకంలో రాసిన చాలా అంశాలు నిజమైన పరిస్థితి ఉంది.
Nostradamus: ఈ క్రమంలో వచ్చే ఏడాది అంటే 2024 ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. చాలామందికి తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతోంది. అంటే 2024లో ఏం జరగనుందో నోస్ట్రాడామస్ ఏం చెప్పారో తెలుసుకుందాం..
నోస్ట్రాడామస్ ప్రకారం 2024లో జలవాయు పరివర్తనం చాలా తీవ్రంగా ఉండనుంది. భూమి గతంతో పోలిస్తే చాలా వేడిగా ఉంటుంది. వడగాల్పులు కూడా తీవ్రంగా ఉంటాయి.
నోస్ట్రాడామస్ అంచనాల ప్రకారం 2024లో న్యూక్లియర్ ఎటాక్ జరగవచ్చు. ఇది జలవాయువులపై ప్రభావం చూపించవచ్చు.
నోస్ట్రాడామస్ ప్రకారం కొత్త ఏడాది 2024లో అమెరికా చైనా మధ్య యుద్ధం తలెత్తవచ్చు. ఎరుపు శత్రువు భయంతో పసుపుగా మారిపోతే మహా సముద్హరంలో భయోత్పాతం సంభవిస్తుందని నోస్ట్రాడామస్ వ్యాఖ్యానించాడు.
2024 గురించి నోస్ట్రాడామస్ అంచనాలు అందోళన కల్గిస్తున్నాయి. ఆయన చెప్పిందాని ప్రకారం అమెరికాలో అధ్యక్షుడి ఎన్నిక 2024లో అస్థిరతకు దారితీస్తుంది. ఆ దేశంలో అంతర్యుద్ధం రావచ్చు.
నోస్ట్రాడామస్ జర్మనీలో హిట్లర్ ఉదయించడం నుంచి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య వరకూ 100 మంది భవిష్యత్ అంచనా వేశారు. కవితల ద్వారా నోస్ట్రాడామస్ భవిష్యత్ అంచనా వేసేవారు. ఆ కవితల్ని డీకోడ్ చేసి భవిష్యవాణిగా ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు.