Ola Electric: ఓలా నుంచి అదిరిపోయే శుభవార్త.. రూ.39 వేలకే.. 112 కి.మీల మైలేజీ Gig ఎలక్ట్రిక్‌ బైక్‌..

Ola Electric Gig: ఓలా (Ola Electric) నుంచి మార్కెట్‌లోకి కొత్త ఈ స్కూటర్స్‌ లాంచ్‌ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ స్కూటర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. 
 

Ola Electric Gig: ప్రముఖ ఎలక్ట్రిక్‌ మోటర్‌ సైకిల్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఎప్పటికప్పుడు ఇ-స్కూటర్స్‌ను విడుదల చేస్తూ మార్కెట్‌లో దూసుకుపోతోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరల్లోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ ఈ స్కూటర్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఇటీవలే కూడా ఓలా మరో కొత్త స్కూటర్‌ సిరీస్‌ విడుదల చేసింది. వీటినికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
 

1 /5

ఓలా ఎలక్ట్రిక్  (Ola Electric)  కంపెనీ ఈ స్కూటర్స్‌ను 'గిగ్'(Gig) సిరీస్‌లో విడుదల చేసింది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన బ్యాటరీలలో విడుదలయ్యాయి. ఈ స్కూటర్స్‌ ధర రూ.39 వేల నుంచి ప్రారంభం కాబోతున్నాయి.   

2 /5

ఓలా విడుదల చేసిన 'గిగ్' సిరీస్‌లో రెండు వేరియంట్స్‌ ఉంటాయి. ఇందులో మొదటిది 'గిగ్' అయితే రెండవది 'గిగ్+' వేరియంట్‌ పేరుతో విడుదలైంది. ఇందులోని మొదటి వేరియంట్‌ రూ. 39,999 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక రెండవ వేరియంట్‌ రూ.49,999 (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులోకి రానుంది.   

3 /5

ఈ గిగ్‌ ఈ - స్కూటర్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 112 కి.మీల పరిధి మైలేజీ అందిస్తుంది. దీని గరిష్టంగా 25 కి.మీ/గం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ రెండు సిరీస్‌లు 1.5 kWh బ్యాటరీతో లాంచ్‌ అయినట్లు తెలుస్తోంది.   

4 /5

'గిగ్+'(Gig+) వేరియంట్‌ సింగిల్/డ్యూయల్ బ్యాటరీ (1.5 kWh)తో విడుదలైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మొదటి వేరియంట్‌ కంటే అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.   

5 /5

ఈ - స్కూటర్స్ త్వరలోనే అన్ని ఓలా షో రూమ్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల సమయంలో కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.