ఇకపోతే ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అకీరా గురించి ఒక విషయం తెలియజేసింది రేణూ దేశాయ్. పవన్ కళ్యాణ్ లాగే అఖీరా నందన్ కి కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం అని, నాచురల్ గా పండిన ఆహారాలనే.. ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతాడు అని, ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడని తెలిపింది. అందుకోసం యోగా, మార్షల్ ఆర్ట్స్, ప్రాణాయామం కూడా చేస్తూ ఉంటాడు అంటూ తెలిపింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అకిరా కూడా తండ్రి బాటలోనే ముందుకెళ్తున్నారు.
భార్య భర్తలు విడిపోయినా.. తల్లిదండ్రులుగా కలిసే ఉన్నారు ఈ జంట. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి విషయంపై కూడా చర్చించుకుంటారని సమాచారం. ఇదిలా ఉండగా మరొకవైపు పవన్ కళ్యాణ్ తో పాటు అకీరా నందన్ కూడా ఏపీ ఎన్నికలలో జోరుగా కనిపించారు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో చంద్రబాబు నాయుడు ని కలిసి, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి మోదీని కూడా కలిసారు. జనసేన జనసేన పార్టీ 100% మెజారిటీ సాధించడంతో, ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ ను తండ్రి తో పాటు ఎంజాయ్ చేశారు అకీరా. దీంతో సినిమాల్లోకి రాబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
నందిని రెడ్డిని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే విభేదాలు వచ్చిన తర్వాత విడిపోయారు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నారు. కానీ రేణు దేశాయ్ మాత్రం పిల్లలను చూసుకుంటూ ముంబైలో కెరియర్ కొనసాగిస్తోంది
ఈ సినిమాలు పూర్తి చేసిన తర్వాత మళ్లీ కంటిన్యూ అవుతారా? లేక రాజకీయాలకే పరిమితం అవుతారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఎక్కడైనా సరే తల్లిదండ్రుల పోలికలు, లక్షణాలు పిల్లల్లో కనిపించడం సహజం. మరి పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాలో కూడా తన తండ్రి పవన్ కళ్యాణ్ లక్షణాలు వచ్చాయి. అయితే ఈ విషయాలను అఖీరానందన్ తల్లి రేణూ దేశాయ్ స్వయంగా చెప్పేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా కొనసాగుతూనే, మరొకవైపు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు కూడా త్వరగా పూర్తిచేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం మూడు సినిమాలు పెండింగ్లో ఉన్నాయి.
Authored By:
Vishnupriya Chowdhary
Publish Later:
No
Publish At:
Tuesday, September 24, 2024 - 20:08
Mobile Title:
Pawan Kalyan: తండ్రికి తగ్గ తనయుడు.. అకీరాకి వచ్చిన పవన్ క్వాలిటీ..!
Created By:
Vishnupriya Chowdhary
Updated By:
Vishnupriya Chowdhary
Published By:
Vishnupriya Chowdhary
Request Count:
13
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.