Pitru paksham 2024: పితృపక్షం వెనుక మహాభారత కథ.. కర్ణుడు చనిపోయిన 16 రోజులకు మళ్లీ భూమి మీదకు.. ఎందుకో తెలుసా..?

Pitru paksham karna story: పితృపక్షాలలో చనిపోయిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తారని చెబుతుంటారు. అయితే.. దీని వెనుక మహాభారత కథ ఉంది. మహా భారతంలో కర్ణుడు స్టోరీ అందరికి తెలిసిందే.. 
 

1 /8

ప్రస్తుతం దేశంలో పితృపక్షాలు స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబరు 2 వరకు పితృపక్షాలను నిర్వహించుకుంటున్నాము. ఈ పదిహేను రోజులలో భూమి మీదకు చనిపోయిన పూర్వీకులు భూమిమీదకు వస్తారని చెబుతుంటారు.

2 /8

పూర్వీకుల ఆశీస్సులు కోసం తప్పకుండా పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ పదిహేనురోజులలో చనిపోయిన మన వారి తిథిని అనుసరించి శ్రాధ్దాధి కార్యక్రమాలు నిర్వహించుకుంటాం.  అయితే.. ముఖ్యంగా పితృపక్షాల వెనుక మహాభారత కథ ప్రచారంలో ఉంది.  

3 /8

మహాభారతంలో కర్ణుడు ఎంత ఫెమసో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఆయన..  కుంతీదేవీకీ జన్మించాడు. అంతేకాకుండా.. ఆయన సూర్యుడి వరం వల్ల జన్మిస్తాడు. ఆతర్వాత మరల కుంతీదేవీ నీళ్లలో కవచ కుండలాలతో ఒక బుట్టలో  వదిలేస్తుంది. ఆతర్వాత  ఒక సారథి ఇంట్లో కర్ణుడు పెరుగుతాడు.

4 /8

కర్ణుడు పుట్టుకతోనే కవచ కుండలాలతో పుడతాడు. ఆయన పరశురాముడి దగ్గర విలువిద్యలు నేర్చుకుంటాడు. ద్రోణా చార్యుడి దగ్గరకు వెళ్లి తనను శిష్యుడిగా అంగీకరించాల్సింది అర్థిస్తాడు. కానీ సూత పుత్రులకు తాను.. విద్యను నేర్చించని అంటాడు. అప్పటి నుంచి కర్ణుడు .. కోపంతో విలువిద్యలో పాండవులు కన్నా గొప్పవాడు కావాలని కలలు కంటాడు.   

5 /8

అప్పటి నుంచి ఆయన విలువిద్యలో పరశురాముడు , సూర్యుడి అనుగ్రహాం వల్ల మంచి విద్యలు అభ్యసిస్తాడు. ఈ నేపథ్యంలో.. కర్ణుడు దానవీర శూర కర్ణ అంటారు. ఆయన ఏది అడిగిన కూడా దానంగా ఇచ్చేస్తుంటారు. కానీ  .. ఇంద్రుడికి ఎంత దాన గుణం ఉన్న కూడా.. కౌరవుల పంచన చేరడం వల్ల ఆయనకు చరిత్రలో మాత్రం చెడ్డపేరు తప్పలేదు. అంతేకాకుండా.. ఆయన అర్జునిడితో తలపడేందుకు ఎక్కువగా పోటీ పడేవాడు.  

6 /8

కర్ణుడు.. తన దగ్గరకు వచ్చిన వారందరికి బంగారం, వెండి,వజ్రాలను దానంగా ఇచ్చేవాడు. ఎవరు కూడా ఆయన ఇంటి నుంచి ఖాళీగా వెళ్లేవారు కాదు. చివరకు తన కవచ కుండలాలను సైతం ఇంద్రుడికి దానంగా ఇచ్చేస్తాడు. అయితే.. మహాభారతంతో అనూహ్యంగా అర్జునిడి చేతిలో కర్ణుడు మరణిస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత మాత్రం స్వర్గలోకంలోకి వెళ్తారు.  

7 /8

అయితే.. స్వర్గలోకంలో కర్ణుడు ఏది తిందామని ముట్టుకున్న.. అది బంగారం అయిపోతుంది... దాహామేస్తే నీళ్లను ముట్టుకుంటే.. అది కూడా బంగారం గా మారిపోతుంది. దీంతో ఆయన ఇంద్రుడికి, అక్కడి మునులకు తన బాధను చెప్పుకుంటాడు. అప్పుడు.. వాళ్లు కర్ణుడి జీవితాంతం ఎప్పుడు కూడా బంగారం, వజ్రాలు దానంగా ఇచ్చాడు. అందు వల్ల ఆయన ఏది ముట్టుకున్న అలానే మారిపోతున్నాయి. ఎవరికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టలేదు. పూర్వీకులకు కూడా శ్రాధ్దం ఎప్పుడు చేయలేదు.

8 /8

అందుకు ఆయనకు అలాజరిగిందని చెప్తారు. దీంతోభూమి కర్ణుడు చనిపోయిన.. 16 వ రోజుకు మరల భూమి మీదకు వస్తాడు. అప్పుడు..  15 రోజుల పాటు పూర్వీకులకు శ్రాద్ధకార్యక్రమాలు చేయాలని చెప్పారంట. అవే ప్రస్తుతం..  పితృపక్షాలుగా మనం చేసుకుంటున్నాం. అందుకు ఈ పితృపక్షాలను ఎంతో పవిత్రంగా భావించుకుంటూ.. చనిపోయిన మన పూర్వీకుల కోసం శ్రాధ్దకర్మాది కార్యక్రమాలు నిర్వహించాలని పండితులు చెబుతున్నారు.   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)