Poonam Pandey: పూనమ్ పాండే సహా చిన్న వయసులోనే కన్నుమూసిన హీరోయిన్స్ వీళ్లే..

సినీ ఇండస్ట్రీ అంటెనే మాయ ప్రపంచం. ఇక్కడ కొంత మందికి మాత్రం అతి తక్కువ సమయంలోనే పెద్ద పేరు తెచ్చుకుంటారు. అలా స్టార్ స్టేటస్ అనుభవించిన వాళ్లు ఆకస్మికంగా చనిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేరు. తాజాగా ప్రముఖ శృంగార తార పూనమ్ పాండే ఆకస్మికంగా గర్భాశయ కాన్సర్‌తో చనిపోవడం సినీ లోకంతో పాటు సామాన్య జనాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో అతి పిన్న వయసులో కన్నుమూసిన సినీ కథానాయికలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

1 /10

Poonam Pandey: ప్రముఖ నటి మోడల్ పూనమ్ పాండే అకాల మరణం చెందారు. గత కొన్నేళ్లుగా సర్వైవల్ కాన్సర్‌తో బాధపడుతున్న ఈమె నిన్న రాత్రి కన్నుమూసినట్టు ఆమె సన్నిహితుల చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఎంతో మంచి భవిష్యత్తు ఉందనుకున్న పూనమ్ పాండే ఆకస్మికంగా చనిపోవడం అందరినీ కలిచివేస్తోంది.

2 /10

జియా ఖాన్: బాలీవుడ్‌లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నిశ్శబ్ద్ సినిమాతో పాపులర్ అయిన జియా ఖాన్.. ఆ తర్వాత డిప్రెషన్ కారణంగా  తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

3 /10

ఆర్తి అగర్వాల్: హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా 31 యేళ్ల అతి చిన్న వయసులోనే 2014లో ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఈమె హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత బరువు పెరగడంతో లైపో ఆపరేషన్ చేయించుకుంది. అది వికటించడంతో కన్నుమూసింది.

4 /10

భార్గవి: ప్రత్యూష బాటలోనే అనుమానాస్పద రీతిలో కన్నుమూసిన మరో నటి 'భార్గవి'. అష్టాచెమ్మా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెను 2008లో దారుణంగా చంపేసారు. అప్పటికీ ఆమె వయసు 23 యేళ్లు.

5 /10

ప్రత్యూష: తెలుగు సినీ ఇండస్ట్రీలో తారా జువ్వాల దూసుకొచ్చిన ఈమె 21 యేళ్ల వయసులో 2002లో అనుమానాస్పదంగా కన్నుమూయడం ఆమె అభిమానులకు బాధ కలిగించింది.

6 /10

సౌందర్య: సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలిన సౌందర్య.. 32 వయసులో 2004లో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం కోసం వస్తు హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు.

7 /10

సిల్క్ స్మిత : తెలుగు సహా భారతీయ చిత్ర పరిశ్రమను తన ఐటెం సాంగ్స్ ఊపెసిన నటి సిల్క్ స్మిత. 36 యేళ్ల చిన్న వయసులోనే డిప్రెషన్ కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను శోక సముద్రంలో ముంచేసింది.

8 /10

దివ్య భారతి : దివ్య భారతి 1993లో అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్‌గా బాక్సాఫీస్ బద్దలు చేసిన దివ్య భారతి.. 19 యేళ్ల వయసులోనే అనుమానాస్పదంగా కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటికే ఈమె ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం రేపింది.

9 /10

ఫటాఫట్ జయలక్ష్మి: అంతులేని కథ సినిమాలో ఫటాఫట్ అంటూ సంచనం సృష్టించిన తార ఫటాఫట్ జయలక్ష్మి. అప్పట్లో ఓ బడా హీరో కొడుకుతో వచ్చిన వివాదం కారణంగా ఈమె 22 యేళ్ల చిన్న వయసులోనే ఆత్మహత్యకు పాల్పపాడింది.

10 /10

మహానటి సావిత్రి : మహానటిగా దక్షిణాది ప్రజలతో కీర్తింపబడిన సావిత్రి.. 45 యేళ్ల వయపులోనే అనారోగ్యంతో కన్నుమూసారు. 1935లో జన్మించిన సావిత్రి.. 1981లో కన్నుమూసారు. ఈమె చనిపోయిన నాలుగు దశాబ్దాలు గడుస్తోన్న ఇప్పటికీ ప్రజల హృదయాల్లో మహానటిగానే కొలువై ఉంది.