Prabhas Rare Record: మన దేశంలో ఆ రికార్డు ఉన్న ఏకైక హీరో ప్రభాస్.. ఇదిగో ప్రూఫ్..

Prabhas Rare Record: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి ’ సిరీస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అయిపోయాడు.  అక్కడ నుంచి రెబల్ స్టార్ నటించిన ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతూ సంచలనాల మీద  సంచలనాలు రేపుతోంది. ముఖ్యంగా సౌత్ సహా బాలీవుడ్ లో ఏ హీరోకు సంబంధించిన బాక్సాఫీస్ వసూల్లు ప్రభాస్ దరిదాపుల్లో లేవు.

1 /11

టాలీవుడ్ లోనే కాదు.. మన దేశంలోనే ప్రభాస్ నటించిన ఈ సినిమాల  కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మరే తెలుగు సహా మన దేశంలో మరే హీరోకు ఈ రేంజ్ రికార్డు లేదనే చెప్పాలి.

2 /11

రెబల్.. రెబల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా..  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 10లో నిలిచింది.

3 /11

మిస్టర్ పర్ఫెక్ట్.. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లతో రాబట్టి టాప్ 9లో నిలిచింది.

4 /11

మిర్చి.. కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 87 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ 8లో నిలిచింది.

5 /11

రాధే శ్యామ్.. రాధే శ్యామ్ మూవీ డిజాస్టర్ గా నిలిచినా.. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 7లో నిలిచింది.

6 /11

ఆదిపురుష్.. ప్రభాస్ రాఘవగా  నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 6లో నిలిచింది.

7 /11

సాహో.. సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార ప్రభాస్ కథానాయకుడిగా  తెరకెక్కిన మూవీ ‘సాహో’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ 5 లో ఉంది.

8 /11

సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా  తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్   టాప్ 4 లో ఉంది.

9 /11

బాహుబలి -1.. ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన బాహుబలి పార్ట్ -1 సినిమా వరల్డ్ వైడ్ గా  రూ. 650 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 3లో నిలిచింది.

10 /11

కల్కి 2898 AD.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’ మూవీ. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర  దాదాపు రూ.1111 కోట్ల గ్రాస్ వసూళ్ల ను రాబట్టింది.  

11 /11

బాహుబలి 2 - ది కంక్లూజన్.. ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో  తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2 - ది కంక్లూజన్’ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ ప్లేస్ లో ఉంది.