ఆమెకు మంచి క్రేజ్ ఉన్న సమయంలో శ్రీదేవి బంగ్లా అనే సినిమా ప్రకటించారు కానీ శ్రీదేవి భర్త బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది ఆగిపోయింది.
ప్రస్తుతానికి ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు కానీ విష్ణు ప్రియ అనే కన్నడ సినిమాలో ఆమె నటిస్తోంది. ఇక మలయాళంలో కొల్లా అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాలో నటించింది కానీ వర్కౌట్ కాలేదు. ఆ సినిమా హిట్ కాకున్నా తేజ సజ్జా హీరోగా రూపొందిన ఇష్క్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది కానీ ఆ సినిమా కూడా సరిగా ఆడలేదు.
ఆ సినిమా హిట్ కాకున్నా ఒక పాటలో ఆమె కన్ను గీటి ఒక్కసారిగా ఫేమస్ అయిపొయింది. ఆ తరువాత ప్రియకి తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కాయి.
కేరళలోని త్రిసూర్ లో పుట్టి పెరిగిన ప్రియా ప్రకాష్ వారియర్ తమిళంలో రూపొందిన ‘’ఒరు ఆధార్ లవ్’’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.