Raksha Bandhan 2024: రాఖీ పండగ సందర్బంగా మీ సోదరికి ఈ గిఫ్ట్ ఇస్తే ఆమె జీవితాంతం మర్చిపోదు..కోటీశ్వరాలు అవడం ఖాయం

Raksha Bandhan 2024: మీ సోదరికి చక్కటి బహుమతి అందించాలని అనుకుంటున్నారా..అయితే ఆమె భవిష్యత్తుకు భరోసా అందించే బహుమతి అందిస్తే జీవితాంతం ఆమెకు ఒక మరుపురాని కానుకగా మిగిలిపోతుంది. అలాంటి బహుమతి గురించి తెలుసుకుందాం.

1 /6

Raksha Bandhan 2024: రాఖీ పండుగ సందర్భంగా మీ సోదరికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా అయితే ఓ చక్కటి  ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం.  మీరు కనుక రాఖీ పండుగ సందర్భంగా మీ సోదరికి  ఆమె భవిష్యత్తుకు ఉపయోగపడే గిఫ్ట్ ఇవ్వడం ద్వారా మీరు వారికి మరచిపోలేని కానుక ఇవ్వవచ్చు. 

2 /6

మ్యూచువల్ ఫండ్స్ కానుకగా ఇవ్వవచ్చు :  మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భవిష్యత్తులో చక్కటి రాబడి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో మీరు డబ్బు సంపాదించవచ్చు. మీరు మీ సోదరికి చక్కటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ఆమె పేరిట మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆమెకు స్వాధీనం చేయవచ్చు.   

3 /6

దీని ద్వారా ఆమెకు భవిష్యత్తులో చక్కటి మొత్తంలో డబ్బు లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు లంప్సం ప్రాతిపదికన డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఏ మ్యూచువల్ ఫండ్ లో డబ్బు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా. ఫ్రంట్ లైన్ ఇండెక్స్ సూచీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ప్రతి స్టాక్ మార్కెట్ కు అనుగుణంగా డబ్బు పొందే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ సూచీలు గత కొన్ని సంవత్సరాలుగా భారీ రిటర్న్స్ అందిస్తున్నాయి.   

4 /6

పోస్టాఫీసు స్కీం ద్వారా కానుక ఇవ్వవచ్చు: మీరు పోస్ట్ ఆఫీస్ లో కిసాన్ వికాస్ పత్రంను కొనుగోలు చేసి మీ సోదరికి  కానుకగా ఇవ్వవచ్చు. ఎందుకంటే కిసాన్ వికాస్ పత్ర ద్వారా, మీ డబ్బు గ్యారెంటీగా రెండింతలు అయ్యేలా పోస్ట్ ఆఫీస్ హామీ అందిస్తుంది. పోస్ట్ ఆఫీసును స్కీం ద్వారా మీరు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించవచ్చు. ఇందులో  పోస్ట్ ఆఫీస్ అందించే ఇతర పథకాల కన్నా కూడా ఎక్కువ వడ్డీ లభిస్తుంది.   

5 /6

మీ సోదరికి  ప్లాటును  బహుమతిగా ఇవ్వవచ్చు:  ప్రస్తుతం నగరం శివార్లలో  చక్కటి లేఔట్లను రియల్ ఎస్టేట్ సంస్థలు డెవలప్ చేస్తున్నాయి. మీ సోదరికి మీరు చక్కటి భవిష్యత్తును అందించే బహుమతి ఇవ్వాలి అనుకుంటే, మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి లేఅవుట్ ను బహుమతిగా ఇవ్వవచ్చు.    

6 /6

తద్వారా మీరు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నగరంలో చిన్న చిన్న లేఅవుట్లకు మంచి డిమాండ్ ఉంది.  150 గజాల నుంచి 500 గజాల వరకు మీరు ప్లాట్లను బహుమతిగా అందించవచ్చు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x