Ramoji Rao Top Movies: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సహా ఉషాకిరణ్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టాప్ చిత్రాలు ఇవే..

Ramoji Rao Top Movies: పాత్రికేయ రంగంలో రాణించిన రామోజీ రావు సినీ రంగంలో కూడా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై పలు విజయ వంతమైన చిత్రాలను నిర్మించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్నత కూడిన వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఘనత రామోజీ రావుకు దక్కుతోంది. ఆయన కెరీర్ లో టాప్ సినిమాల విషయానికొస్తే..

1 /11

‘శ్రీవారికి ప్రేమలేఖ’ ప్రతిఘటన, నువ్వేకావాలి, చిత్రం సహా ఉషాకిరణ్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టాప్ చిత్రాలు ఇవే..

2 /11

శ్రీవారి ప్రేమలేఖ జంధ్యాల దర్శకత్వంలో  నరేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

3 /11

ప్రతిఘటన టి.కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయి వంటిది.

4 /11

ప్రేమించి పెళ్లాడు.. రాజేంద్ర ప్రసాద్ హీరోగా పరిచయం అవుతూ వంశీ దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం

5 /11

మయూరి సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుధాచంద్రన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఆ పాత్రలో ఆమె నటించడం విశేషం.

6 /11

  మౌన పోరాటం ఏ.మోహన్ గాంధీ దర్శకత్వంలో వినోద్ కుమార్, యమున హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతూ తెరకెక్కిన మౌన పోరాటం సినిమా అప్పట్లో ఓ సంచలనం

7 /11

పీపుల్స్ ఎన్ కౌంటర్ మోహన్ గాంధీ దర్శకత్వంలో వినోద్ కుమార్,భానుప్రియ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.

8 /11

చిత్రం ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘చిత్రం’. ఈ సినిమా తెలుగు సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

9 /11

నువ్వే కావాలి తరుణ్, రిచా పల్లోడ్ హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతూ  తెరకెక్కిన చిత్రం ‘నువ్వే కావాలి’. కే.విజయ భాస్కర్ దర్శకత్వంలో  వచ్చిన ఈ సినిమా  అప్పట్లో ఓ సెన్సేషన్ కాదు..సునామీ క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

10 /11

ఆనందం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆకాశ్, రేఖ హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆనందం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.

11 /11

నచ్చావులే తనీష్ హీరోగా మాధవి లత హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం నచ్చావులే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించి ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ వాల్యూ పెంచింది.