రిలయన్స్ జియో కొత్తగా వార్షిక ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్‌తో ఇక రీఛార్జ్ టెన్షన్ ఉండదు. జూలై 3 నుంచి రీఛార్జ్ ధరలు పెంచిన తరువాత వేర్వేరు రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్ వ్యాలిడిటీ, డేటా వేర్వేరుగా ఉంటాయి. అలాంటిదే ఈ వార్షిక ప్లాన్.
Jio Annual Plan Benefits: రిలయన్స్ జియో కొత్తగా వార్షిక ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్‌తో ఇక రీఛార్జ్ టెన్షన్ ఉండదు. జూలై 3 నుంచి రీఛార్జ్ ధరలు పెంచిన తరువాత వేర్వేరు రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్ వ్యాలిడిటీ, డేటా వేర్వేరుగా ఉంటాయి. అలాంటిదే ఈ వార్షిక ప్లాన్.
డేటా ఎక్కువగా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం బయట తిరిగేవారికి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో 5జి నెట్‌వర్క్ ప్లాన్ లభిస్తుంది.
జియో అందిస్తున్న ఈ ప్లాన్‌లో ఏడాది పొడవునా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అంతే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచితంగా లభిస్తాయి. 5జీ ఇంటర్నెట్ అందుతుంది
రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ఏడాది ప్లాన్ ఖరీదు 3599 రూపాయలు. 365 రోజులు పనిచేస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు ఏడాదికి కలిపి మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2.5 జీబీ డేటా. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఎలానూ ఉంటుంది.
రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం మరో బెస్ట్ ప్లాన్ లాంచ్ చేసింది. ఇది ఏడాది వ్యాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. దాంతో పాటు ఇందులో కావల్సినంత డేటా,అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.
జియో నుంచి వేర్వేరు ప్లాన్స్ వేర్వేరు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో రోజుకు 1 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఉన్నాయి. వీటి వ్యాలిడిటీ కూడా వేర్వేరుగానే ఉంటుంది.
రిలయన్స్ జియో బాధ్యతలను ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నిర్వహిస్తున్నాడు. దేశంలో ఇంటర్నెట్ వినియోగంలో జియో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. డేటా వినియోగం పెరిగింది. దేశంలోని నలుమూలలా ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి.