Sharmitha Gowda: కజకిస్తాన్‌లో చిల్‌ అవుతూ నెట్టింటా రచ్చ చేస్తోన్న రుద్రాణీ అలియాస్‌ షర్మితా గౌడ.. ఫోటోస్‌ వైరల్

Sharmitha Gowda Kazakhstan Photos Viral: రుద్రాణీగా మంచి విలాన్‌ పాత్ర పోషిస్తున్న షర్మితా గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె 'బ్రహ్మముడి' సీరియల్‌లో రాజ్‌కు అత్త క్యారెక్టర్‌లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఈమె కన్నడ నటి. ప్రస్తుతం ఈ సీరియల్‌లో ఆమె నటనతో దూసుకుపోతున్నారు. అయితే, ఇటీవలె ఆమె పుట్టినరోజు సందర్భంగా కజకిస్తాన్‌ వెళ్లారు ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.
 

1 /10

షర్మితా గౌడ 'బ్రహ్మముడి' సీరియల్‌ కంటే ముందు 'గీత' అనే కన్నడ సీరియల్‌ నటించారు. ఈమె గతంలో మాల్దీవుల్లో కూడా చిల్‌ అయిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.  

2 /10

ఇప్పుడు పుట్టిన రోజు సందర్భంగా కజకిస్తాన్‌ వెళ్లారు. అక్కడ బర్త్‌ డే వేడుకలు చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  

3 /10

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. బుల్లితెరపై లేడి విలాన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోన్న షర్మిత అప్పుడప్పుడు ఫారిన్‌ ట్రిప్పులు కూడా వేస్తోంది.  

4 /10

మాల్దీవుల ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కుర్రకారుకు సెగలు పుట్టించారు. ఇక కన్నడ సీరియల్‌ 'గీత'లో భానుమతి క్యారెక్టర్‌తో అలరించారు.  

5 /10

ప్రస్తుతం 'బ్రహ్మముడి' సీరియల్‌లో రుద్రాణీ క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు. ఏమాత్రం కాస్త తీరిక దొరికినా రీల్స్‌ చేస్తూ కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తారు.  

6 /10

ఇక ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే ఉంటున్న షర్మిత గౌడ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉంటారు.   

7 /10

షర్మితా గౌడ తోటి నటులతో కలిసి రీల్స్‌ చేస్తూ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఉంటారు. షర్మితా గౌడ డ్రెస్సింగ్‌ సెన్స్‌కు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు.  

8 /10

'బ్రహ్మముడి' సీరియల్‌లో కూడా ఆమె వేసే డ్రెస్సులు హైలట్‌. హీరోయిన్‌ కంటే కూడా ఈమె వేసుకునే చీరలు ట్రెండింగ్‌లో ఉంటాయి.  

9 /10

ఇక ఈ సీరియల్‌ రుద్రాణీ క్యారెక్టర్‌లో షర్మితా గౌడ జీవించేసింది. ఒక్కోసారి చూసే ప్రేక్షకులకే కోపం తెప్పించేలా ఉంటుంది ఆమె నటన.  

10 /10

రుద్రాణీగా ఆమె నటన తీరు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించింది. సీరియల్‌ తోపాటు కొన్ని షోలలో కూడా ఈమె కనిపిస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కుటుంబానికి సంబంధించిన ఫోటోలు షేర్‌ చేస్తూ యాక్టీవ్‌గా ఉంటారు.