Sai Pallavi emotional post: సాయి పల్లవి తన సోదరి పెళ్లిపై ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తొంది. అప్పుడే పెళ్లి జరిగిన మూడు నెలలు అయిపోయిందని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.
సాయి పల్లవి ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. తన సోదరి, ఆమె ఫ్రెండ్స్ తో కలిసి ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లి హల్ చల్ చేశారు.
సాయి పల్లవి బీచ్ లో దిగిన ఫోటోలు నెట్టింట సందడి చేశాయి. అదే విధంగా మరల సాయి పల్లవి వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడు,అన్న పూర్ణ దేవీని సైతం దర్శించుకున్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి తన ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. తన చెల్లి పెళ్లి అయిపోయి అప్పుడు మూడు నెలలు గడిచిపోయాయని ఆమె ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో తనతో గడిపిన ఆనందాలు, తియ్యని విషయాలను సాయి పల్లవి మరల గుర్తు చేసుకున్నారు.
నా చెల్లి పెళ్లిలోని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫుల్ ఎంజాయ్ చేశామని చెప్పుకొచ్చింది. పెళ్లిలో ఇద్దరం కలిసి, ఆడాం, పాడాం, ఎమోషనల్ అయ్యామన్నారు. అదే విధంగా తన చెల్లికి మునుపటిలా సలహాలు, సూచనలు ఇవ్వలేదన్నారు.
తన భర్త.. నాకన్న కూడా.. చెల్లిని బాగా చూసుకుంటున్నాడని.. తనను చిన్న పాపలా బుజ్జగిస్తున్నాడని కూడా సాయిపల్లవి చెప్పినట్లు తెలుస్తొంది. పెళ్లై అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయంటే.. తనకు నమ్మబుద్ది కావట్లేదని రాసుకొవచ్చింది.
ఇలాంటి పీలింగ్స్ నా జీవితంలో ఇది వరకు ఎప్పుడూ కలగలేదు.. అంటూ సాయి పల్లవి ఎమోషనల్ అయ్యి.. తన చెల్లి ఫోటోలను ఇన్ స్టావేదికంగా షేర్ చేసినట్లు తెలుస్తొంది. మరొవైపు సాయి పల్లవి ప్రస్తుతం న్యూ ఇయర్ కు కానుకగా తండేల్ మూడీతో అభిమానుల ముందుకు రానుందని తెలుస్తొంది.