Samantha: కథానాయిక సమంత గురించి ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. గత 15 యేళ్లుగా టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఇలాయిస్తోంది. ఆ మధ్య మయాసిటీస్‌తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి కథానాయికగా బ్యాక్ బౌన్స్ అయింది. అంతేకాదు ఎన్నడు లేనట్టుగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ లేపుతోంది.
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే' మూవీతో హీరోయిన్‌గా లెగ్ పెట్టిన సామ్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ మూవీలో జెస్సీ పాత్రలో సమంత యాక్టింగ్‌ను ఎవరు మరిచిపోలేదు.
15 యేళ్ల కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలతో మెప్పించింది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన 'శాకుంతలం' వంటి పౌరాణిక సినిమా కూడా కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటుతోంది.
సమంత.. ఆ మధ్య మయాసిటీస్ అనే వింత వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సమంత ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తోంది. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో ఈమె ఎల్టీటీఈ ఉగ్రవాది పాత్రలో జీవించింది.
మరోవైపు వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూట్ కంప్లీట్ చేసింది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు హనీ బన్ని అనే టైటిల్ పెట్టారు.
ఆ సంగతి పక్కన పెడితే.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సమంత.. మాయాసిటీస్ నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంది సమంత.