Samantha: మతం మార్చుకున్న సామ్.. దేనికోసం ఇదంతా..?

Samantha Religion: సమంత మతం మార్చుకుంది అంటూ ఎన్నో రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్టే ఎన్నో ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. పుట్టుకతో క్రిస్టియన్ అయిన సమంత.. ప్రస్తుతం హిందూమతంలోకి మారింది అని ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఇందులో నిజం ఏంటో ఒకసారి చూద్దాం..

1 /6

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత ఈ మధ్యకాలంలో.. అవకాశాల కోసం ఎదురుచూస్తోంది అనడంలో సందేహం లేదు.  ముఖ్యంగా నాగచైతన్యను ప్రేమించి.. పెళ్లి చేసుకున్న తర్వాత సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోయిన ఈమె.. అనుకోకుండా భర్త నుంచి విడిపోయి వార్తల్లో నిలిచింది. 

2 /6

సమంత తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. సమంత చేసిన తప్పుల వల్లే నాగచైతన్య ఆమెను వదిలేసారు అంటూ కూడా వార్తలు వైరల్ చేశారు. అయితే వీటన్నింటికీ కూడా అమ్మ చెప్పింది అనే కాన్సెప్ట్ తో కొటేషన్లు షేర్ చేస్తూ.. ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది సమంత.  

3 /6

దీనికి తోడు మయోసైటిస్ అనే వ్యాధి బారినపడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. లక్షల రూపాయలు..  కాదు కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా.. సరే ఆమె వ్యాధి నయం అవలేదు. అయితే ప్రస్తుతం తన వ్యాధి తగ్గుముఖం పడుతోందని , దానికి కారణం హిందూ ధర్మం అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు పుట్టుకతో క్రిస్టియన్ గా.. పుట్టిన ఈమె తన మతాన్ని కూడా మార్చుకొని హిందూ మతంలోకి చేరినట్లు రూమర్స్ తెగ వస్తున్నాయి.   

4 /6

ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళితే సౌత్ ఇండియన్ హీరోయిన్ సమంత స్వామి జగ్గీ వాసుదేవ్.. సమక్షంలో క్రైస్తవ మతాన్ని వీడి హిందూ మతంలోకి చేరింది అంటూ..తెగ పోస్టులు వేస్తున్నారు చాలామంది. కోట్ల రూపాయల విలువైన కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నా సరే తన ఆరోగ్య సమస్య లక్ష ఓంకార మంత్ర జపంతో నయం చేసి.. ఉపశమనం పొందేల తనకు మార్గదర్శనం.. చేసిన స్వామి జగ్గీ వాసుదేవ్ కి ధన్యవాదాలు అంటూ సమంత ఈ మధ్యనే సోషల్ మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. 

5 /6

అందుకే సమంత జగ్గీ వాసుదేవ్ జీ.. వద్ద క్రిస్టియానిటీ వదిలి హిందూ ధర్మం స్వీకరించింది అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈమధ్య సమంత.. నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని మనం పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చిన మాటలు కూడా తెగ వైరల్ అయ్యాయి. 

6 /6

ఇక ప్రస్తుతం మతం మారడం వెనుక ఆరోగ్య సమస్యలే కారణం.. అని స్పష్టం అవుతోంది. కానీ ఇందులో నిజం ఏంటో తెలియాలి అంటే మరి కొద్దిరోజులు వేచి చూడాలి.