Sankranthi Winners: హనుమాన్ సహా సంక్రాంతి సీజన్లో విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే..

Sankranthi Winners: తెలుగు సినిమాలకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. ఈ సీజన్‌లో విడుదలైన చిత్రాలు ఓ మోస్తరు టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులపడం ఖాయం. అందుకే మన హీరోలు, దర్శక, నిర్మాతలు సంక్రాంతి సీజన్‌లో తమ సినిమాలను విడుదల చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. తాజాగా 2024 సంక్రాంతి సీజన్‌లో విడుదలైన హనుమాన్ మూవీ ఇప్పటి వరకు రిలీజైన సంక్రాంతి సినిమాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా సంక్రాంతి సీజన్‌లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాల విషయానికొస్తే..

1 /8

1. హనుమాన్: హనుమాన్ మూవీ 2024 సంక్రాంతి సీజన్‌లో హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 300 గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతూనే ఉంది.

2 /8

2. అల వైకుంఠపురములో:  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ మూవీ 2020 సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర రూ. 260 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

3 /8

3. వాల్తేరు వీరయ్య: చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా రూ. 230 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

4 /8

4. సరిలేరు నీకెవ్వరు: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ మూవీ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర రూ. 220 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

5 /8

5. గుంటూరు కారం: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూవీ 'గుంటూరు కారం'. ఈ మూవీ ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో కూడా రూ. 201 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

6 /8

6. ఖైదీ నంబర్ 150: చిరంజీవి, వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఖైదీ నంబర్ 150'. ఈ మూవీ సంక్రాంతి కానుగా విడుదలై రూ. 165 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

7 /8

7. వీరసింహారెడ్డి : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరెక్కిన మూవీ 'వీరసింహారెడ్డి'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 135 కోట్లు రాబట్టింది.

8 /8

8. F2: వెంకటేష్, వరుణ్‌ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఎఫ్ 2'. ఈ మూవీ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర రూ. 130 కోట్ల రాబట్టింది.