Shardul Thakur: పెళ్లి పీటలు ఎక్కనున్న శార్దుల్ ఠాకూర్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా..!

Shardul Thakur Marriage: టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గతేడాది తన ప్రేయసి మిథాలీతో శార్దూల్ నిశ్చితార్థం జరిగింది. తాజాగా పెళ్లి డేట్‌పై అప్‌డేట్ వచ్చింది. 

  • Dec 17, 2022, 17:38 PM IST
1 /5

ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడే సమయంలో శార్దూల్‌కు మంచి పేరు వచ్చింది. ఆ జట్టు తరపున సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.   

2 /5

శార్దూల్ ఠాకూర్‌కు కాబోయే భార్య మిథాలీ పారుల్కర్ వ్యాపారవేత్త. ఆమె థానేలో ఆల్ ద బేక్స్ పేరుతో స్టార్టప్ కంపెనీని నడుపుతోంది. మిథాలీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

3 /5

ముంబైలో వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు దాదాపు 200 నుంచి 250 మంది అతిథులు హాజరుకానున్నారు.  

4 /5

అతను ఫిబ్రవరి 24వ తేదీ వరకు క్రికెట్ ఆడతాడని మిథాలీ తెలిపింది. ఆ తరువాత ఫిబ్రవరి 25 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పింది. ఫిబ్రవరి 27న పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. 

5 /5

శార్దూల్ ఠాకూర్ గర్ల్ ఫ్రెండ్ మిథాలీ పారుల్కర్‌తో 29 నవంబర్ 2021న ముంబైలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా హాజరయ్యాడు.