Sharavana masam 2024: శ్రావణ మాసంను ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి అత్యంత అరుదుగా.. ఒకే రోజు వరలక్ష్మీ వ్రతం, పుత్రదా ఏకాదశి కూడా ఒకే రోజు వచ్చాయి. ఈరోజున కొన్నినియమాలు పాటిస్తే జీవితంలో గొప్ప ఫలితాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు.
శ్రావణ మాసంనుం పండగల మాసం అని చెప్పవచ్చు. ఈ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక పండుగవస్తునే ఉంటుంది. మహిళలు శ్రావణ మాసంలో శుక్రవారంరోజున వచ్చే.. వరలక్ష్మీ వ్రతంను ఎంతో భక్తితోజరుపుకుంటారు. ఆగస్టు 16 న వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్నారు. ఈరోజున ఉదయం 8 నుంచి 10 వరకు సమయం బాగుందని పండితులు చెబుతున్నారు.
మరల సాయత్రం వేళ కూడా 4 గంటల నుంచి రాత్రి వరకు పూజలు చేసుకొవడానికి మంచి సమయం. అమ్మవారికి చక్కెర పొంగలి,పాయసం అంటే ఇష్టమని చెబుతుంటారు. ఈరోజున మహిళలను ఇంటికి పిలిచివాయనాలు ఇచ్చుకుంటారు. దీని వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. తమభర్త, పిల్లలకుఅమ్మవారి అనుగ్రహాం కోసం పూజలు చేస్తుంటారు
వరలక్ష్మీ వ్రతంరోజు.. అరుదుగా ఈసారి పుత్రదా ఏకాదశి కూడావచ్చింది. ఈరోజున విష్ణువును ఆరాధిస్తే జీవితంలోని సమస్యలన్ని దూరమౌతాయి. విష్ణుదేవుడి జన్మనక్షత్రం శ్రావణం. అందులో శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజున ప్రత్యేకంగా పండ్లు, పాలతో తయారు చేసిన స్వీట్లు నైవేద్యంగా అర్పించాలి. ఈరోజు ఏ పరిహారం చేసిన వెయ్యిరెట్ల మంచి జరుగుతుందని చెబుతుంటారు.
మీనం రాశి.. ఒకే రోజు వరలక్ష్మీ వ్రతం, పుత్రదా ఏకాదశి వల్ల.. మీనరాశివారికి ఆకస్మిక ధనలాభయోగం ఉంది. దీనివల్ల రాదనుకొని వదిలేసిన డబ్బులు వస్తాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో వారితో సఖ్యత ఏర్పడుతుంది.
మేషం..ఈ రాశివారు స్నేహితులతో డబ్బులు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాలలో రాణిస్తారు. నచ్చిన అమ్మాయిలో పెళ్లి సంబంధం కుదురుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయం చేస్తుంటారు. విదేశాలకు వెళ్లే యోగం కన్పిస్తుంది.
మిథునం.. ఈ రాశి వారికి భార్యతరపు నుంచి ఆస్తులు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ వల్ల లాభం పొంది ముఖం చాటేసిన వారు మరల మీదగ్గరకు వస్తారు. మీకు ల్యాటరీలు తగిలే చాన్సులు ఉన్నాయి. రాజకీయాల్లో రాణిస్తారు.
కర్కాటకం .. ఈ రాశివారికి ముట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పుకొవచ్చు. అంటే ఏ పనిచేసిన కూడా అందులో విజయం సాధిస్తారు. తొందరలోనే నచ్చిన అమ్మాయితో పెళ్లికుదురుతుంది. మీకు భూమిలో నిధులు దొరికే అవకాశం కూడా ఉంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)