Shriya Saran: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ఈమె కథానాయికగా తెరంగేట్రం చేసి దాదాపు పాతికేళ్లు కావొస్తోంది. అయినా..ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ సైతం కుళ్లు కొనేలా తన ఫిగర్ మెయింటెన్ చేస్తోంది. అంతేకాదు తెలుగు సహా ఇతర భాషల్లో బడా సీనియర్ స్టార్ హీరోలకు శ్రియా బెస్ట్ ఆప్షన్‌గా మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా అగ్గి రాజేసే అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
శ్రియ అపుడెపడో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉంది. అంతేకాదు హీరోయిన్ గా ఫేడౌట్ అయినా.. సీనియర్ కథానాయకులకు బెస్ట్ ఆప్షన్ లా మారింది.
శ్రియ విషయానికొస్తే.. తెలుగులో ఏ ఈమెలా సీనియర్ టాప్ స్టార్స్ తో పాటు, యంగ్ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఘనత ఈమెకే దక్కింది.
అందరికీ ఏజ్ తో పాటు గ్లామర్ తగ్గిపోతూ ఉంటే.. శ్రియకు మాత్రం వయసుతో పాటు అందం పెరుగుతూనే ఉంది. అంతేకాదు ఈ ఏజ్ లో కూడా యంగ్ బ్యూటీలు సైతం కుళ్లు కునేలా హాట్ ఫోట్ షూట్స్ తో సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తోంది.
శ్రియ వయసు 40 యేళ్లు దాటింది. అంతేకాదు ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే అంద చందాలతో అలరించడం అంటే మాములు విషయం కాదు. ఒకప్పటి హేమా మాలిని, రేఖలా ఈ జనరేషన్ లో శ్రియ పేరు చెప్పుకోవాలేమో.
శ్రియ.. ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటైన ఫోజులతో ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
సినిమాల్లో హీరోయిన్ గా ఈమె వయసుకు తగ్గ పాత్రలు ఈమెను పలకరిస్తూనే ఉన్నాయి. నటిగా యాక్ట్ చేస్తోన్న సమయంలోనే 2018లో విదేశీయుడైన ఆండ్రీ కోస్చీవ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది.