Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ వ్యాఖ్యాతగా ఆమె కంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉండటం అమ్మడి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
తెలుగు టెలివిజన్ యాంకర్ గా శ్రీముఖి కంటూ సెపరేట్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే.. క్యారెక్టర్ డిమాండ్ మేరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.
శ్రీముఖి.. కెరీర్ విషయానికొస్తే.. మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా సాగిపోతూనే ఉంది. ప్రెజెంట్ శ్రీముఖి.. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినీ పరిశ్రమలో ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయట.
శ్రీముఖి రియాలిటీ షో బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ షోలో శ్రీముఖి చేసిన లొల్లిని ఎవరు మరిచిపోలేదు. అంతేకాదు ఈ యేడాదిలోనైనా తన పెళ్లికి సంబంధించిన వార్తను అభిమానులకు చెబుతుందా అనేది చూడాలి.
శ్రీముఖి.. తన అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన 'భోళా శంకర్' సినిమాలో యాక్ట్ చేసింది. ఈ చిత్రంలో అంతగా ప్రాధాన్యత లేని పాత్ర చేయడం శ్రీముఖి కెరీర్లోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే తపనే ఈ క్యారెక్టర్ చేయడానికి ఓ కారణం అని చెప్పాలి.
శ్రీముఖి ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా తనకు సంబంధిచిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమెకు ఓ వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తోన్న ఓల్డ్ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నాగార్జున ఫస్ట్ టైమ్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచారు.
గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు శ్రీముఖి అతన్నిఈ యేడాదే పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది.