Karthika masam: కార్తీక మాసం.. చివరి సోమవారం.. ఇలా చేస్తే ఏడాదిపాటు ఐశ్వర్యంతో పాటు రాజభోగాలు..

Karthika somavaram: కార్తీక మాసంలో చివరిదశకుచేరుకుంది. ఇక రేపు అంటే..25 వ తేదీనా కార్తీకంలో ఆఖరీ సోమవారం వస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు కొన్నినియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
 

1 /6

సాధారణంగా కార్తీక మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో మనం చేసుకునే పూజలు, వ్రతాలు గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ మాసంలో శివ, కేశవుల్ని ఎక్కువగా పూజిస్తుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం అయిపొవడానికి వస్తుంది.

2 /6

వచ్చే ఆదివారం అంటే.. డిసెంబర్1 తో కార్తీకం సమాప్తం అన్నమాట. అందుకు రేపు అంటే.. 25వ తేదీన కార్తీక మాసం చివరి సోమవారం ను జరుపుకుంటున్నాం. ఈ రోజు మనం చేసే పూజాది కార్యక్రమాలు గొప్ప ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు.  

3 /6

ముఖ్యంగా సోమవారం ఉదయం నిద్రలేచీ శివుడ్ని గురించి అభిషేకాలు నిర్వహించాలి. పాలు,పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో శివుడ్ని అభిషేకించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మనం తెలిసి, తెలియక చేసుకున్న పాపాలు పోతాయంట.  

4 /6

ఈరోజు ముఖ్యంగా గుడిలో నెయ్యితో దీపారాధన చేయాలంట. అంతే కాకుండా.. చక్కెర, బెల్లంలను రావి చెట్టు లేదా మేడిచెట్టు అడుగున ఉండే చీమలకు పెట్టాలని పండితులు చెబుతుంటారు. 

5 /6

అదే విధంగా శివుడి ఆలయం, నారాయణుడి ఆలయంలో ధ్వజ స్థంభం మీద ఉన్న కాషాయ జెండాను ఎగర వేయాలి.    అంతేకాకుండా.. శివుడికి, విష్ణుదేవుళ్లకు రకారకాల పూలతో అలంకరణ చేయాలి. ఇలా చేస్తే మనకు ఏడాది పాటు.. ఇంట్లో సంపాదనకు, రాజభోగాలకు లోటుఉండదని పండితులు చెబుతుంటారు.

6 /6

ఈరోజు బియ్యంను నానబెట్టి అదే విధంగా పండ్ల రసాలతో శివుడ్ని అభిషేకం చేస్తే.. మంచి జరుగుతుందంట. చెడును కల్గించే ప్రభావాలు దూరమౌతాయంట.