Pension Scheme: ప్రైవేటు ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్..ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక పెన్షన్ పక్కా..ఎలా చేరాలంటే..?

APY Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ ఉద్యోగుల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ ఉద్యోగులకు సైతం సామాజిక భద్రత కల్పిస్తోంది. దీనిలో భాగంగానే అటల్ పెన్షన్ యోజన తీసుకువచ్చింది. ఈ స్కీములో చేరిన వారి సంఖ్య ప్రస్తుతం 7కోట్లకు చేరుకుంది. ఈ స్కీంకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. తక్కువ పెట్టుబడితో మంచి ప్రయోజనాలు అందించడమే ఇందుకు కారణం. నెలకు రూ. 5వేలకు వరకు పెన్షన్ కూడా పొందవచ్చు. మరి ఈ స్కీమ్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 
 

1 /7

APY Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సామాజిక భద్రత, పొదుపు పథకాలను ఎన్నింటినో తీసుకువచ్చింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ స్కీములను రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్ డబ్బులు, పెన్షన్ అందుతుంది. అయితే అసంఘటిత రంగంలో ఉపాధి పొందేవారికి అలాంటి సదుపాయాలు ఏవీ ఉండవు. వారికి పనిచేసేంత శక్తి ఉన్నంత వరకే కష్టపడుతారు. ఆ తర్వాత ఎలాంటి ప్రయోజనాలు పొందలేరు.   

2 /7

అలాంటివారందరీకి కేంద్రం ప్రభుత్వం ఒక పెన్షన్ స్కీమును తీసుకువచ్చింది. 60ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ వచ్చే విధంగా అటల్ పెన్షన్ యోజన పేరుతో స్కీుమును 2015 వార్షిక బడ్జెట్లో ప్రకటించింది. ఈ స్కీములో చేరిన వారు గరిష్టంగా రూ. 5వేల వరకు పెన్షన్ తీసుకోవచ్చు.   

3 /7

ఇప్పటికే ఈ స్కీములో 7కోట్లకు పైగా మంది నమోదు చేసుకున్నారు. ఈ  ఏడాది ఇప్పటివరకు 56లక్షల మంది తమ పేరును నమోదు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.. ఈ స్కీంలో చేరడం ద్వారా రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 5000 చొప్పున 60ఏళ్లు వచ్చినప్పటికి నుంచి జీవితాంతం నెలనెలా పెన్షన్ తీసుకోవచ్చు.   

4 /7

18ఏళ్ల వయస్సు నుంచి 40ఏళ్లవయస్సులోపు వారందరూ ఈ స్కీములో చేరవచ్చు. అయితే పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ బ్యాంకులో పొదుపు ఖాతా తీసుకుని ఉండాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో ఉండే వారు ఇందులో చేరరాదు. అలాగే ఇతర ట్యాక్స్ చెల్లించే వారు కూడా దీనిలో అనర్హులే.   

5 /7

అయితే వయస్సును బట్టి ఈ స్కీములో నెల నెలా కట్టాల్సిన ప్రీమియం మారుతుంటుంది. 18ఏళ్ల వయస్సులో చేరినట్లయితే 42ఏళ్ల పాటు అంటే 60ఏళ్ల వయసు వచ్చేంత వరకు కట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా నెలకు రూ. 210 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.   

6 /7

వారికి 60ఏళ్ల వయసు వచ్చినప్పటికీ నుంచి నెలకు రూ. 5వేల చొప్పున పెన్షన్ లభిస్తుంది. అదే 40ఏళ్ల వయస్సు వ్యక్తి చేరినట్లయితే నెలకు రూ. 291 నుంచి 1454 వరకు చెల్లించాలి. నెలకు రూ. 1454 వచ్చే 20 సంవత్సరాలు పాటు కడితే  అప్పుడు నెలకు రూ. 5వేల చొప్పున పెన్సన్ వస్తుంది.   

7 /7

ఈ పథకంలో ఎలా చేరాలంటే?  అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు 18 సంవత్సరాల వయస్సు నుంచి 40 ఏళ్లలోపు వారు బ్యాంకుకు వెళ్లి నేరుగా అకౌంట్ తెరవచ్చు. లేదంటే ఆన్ లైన్ ద్వారా ఎన్ ఎస్ డిఎల్ వెబ్ సైట్ ద్వారాను అకౌంట్ ఓపెన్ తీసుకోవాలి. ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి అందులో అటల్ పెన్షన్ యోజన పేజీలోకి వెళ్లాలి. అప్లయ్ నౌ పై క్లిక్ చేయాలి. మీ కస్టమర్ ఐడీ లేదా డెబిట్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.