Sreeleela: ఆ రెండు సినిమాలపైనే శ్రీలీల ఆశలు.. అమ్మడి ఆశలు నెరవేరేనా..!

Sreeleela: శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో బుల్లెట్‌లా వచ్చి రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న శ్రీలీల. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. తాజాగా ఈ భామ ఆ రెండు సినిమాలపైనే తన ఆశలన్ని పెట్టుకుంది. ఈ సినిమాలు ఫ్లాపైతే అంతే సంగతులు అనే చెప్పాలి.

 

1 /5

శ్రీలీల.. ఈ యేడాది  త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించపోయినా..ఈ సినిమాలో శ్రీలీల డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

2 /5

శ్రీలీల విషయానికొస్తే..  2001లో జూలై 14న అమెరికాలో జన్మించింది. వీళ్లది తెలుగు ఫ్యామిలీ కావడం విశేషం. ఈమె తల్లి ప్రముఖ గైనకాలిజిస్ట్. విదేశాల్లో పుట్టిన శ్రీలీల బెంగళూరులో చదువు పూర్తి చేసుకుంది. పెళ్లిసందడి కంటే ముందు కిస్, భారతే వంటి కన్నడ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

3 /5

తెలుగులో శ్రీలీల..  దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో పరిచయం అయింది. మొదటి సినిమాతోనే  తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

4 /5

గతేడాది శ్రీలీల నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. ఒక్క భగవంత్ కేసరి మూవీ మాత్రమే హిట్ అనిపించుకుంది. మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గుంటూరు కారం’ అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది.  

5 /5

అందుకే పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో రవితేజతో చేస్తోన్న సినిమాపై శ్రీలీల భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలు ఫ్లాపైతే ఈమె కెరీర్ కంచికి చేరినట్టే అని చెప్పాలి.