Sreemukhi: లేటెస్ట్ పిక్స్ లో ఏంజెల్ లా మెరిసిపోతున్న శ్రీముఖి.. బిగ్ బాస్ బ్యూటీ అందానికి ఫ్యాన్స్ ఫిదా..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ  డైరీ ఖాళీ లేనంతగా ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స లతో రఫ్పాడిస్తోంది. అంతేనా.. వీలు చిక్కినపుడల్లా తన అందచందాలతో  అదుర్స్ అనిపిస్తోంది.

1 /7

శ్రీముఖి మ్యారేజ్.. గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై శ్రీముఖి ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ యేడాదే ఈ అమ్మడు పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అనేది వెయిట్ అండ్ సీ.

2 /7

శ్రీముఖి కెరీర్ శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా దూసుకుపోతుంది.  ప్రస్తుతం శ్రీముఖి.. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో ఈ భామకు ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. అందులో తనకు సూటయ్యే పాత్రలనే ఎంచుకుంటోంది శ్రీముఖి.

3 /7

శ్రీముఖి రియాలిటీ షో బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ. ఈ షోలో  శ్రీముఖి చేసిన అల్లరిని  ఎవరు మరిచిపోలేదు.

4 /7

శ్రీముఖి - భోళా శంకర్ గతేడాది  శ్రీముఖి.. మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' సినిమాలో కీర్తి సురేష్ ఫ్రెండ్ పాత్రలో నటించింది.  ఈ మూవీలో చిరుతో చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులకు చికాకు తెప్పించింది. అంతేకాదు ఈ సినిమాలో క్యారెక్టర్  ఈ బ్యూటీ కెరీర్ లో ఓ మాయని మచ్చగా మిగిలిపోంది. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక్కటే శ్రీముఖికి మిగిలింది.

5 /7

శ్రీముఖి స్పెషాలిటీ శ్రీముఖి టీవీ యాంక‌ర్ గా ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ  సత్తా చూపెడుతోంది.

6 /7

శ్రీముఖి టీవీ యాంకర్ ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉండటం శ్రీముఖి మార్క్ స్టైల్. అంతేకాదు వీలైనపుడల్లా సామాజిక మాధ్యమాల్లో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.  

7 /7

నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో  రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచారు.