CM Revanth Reddy Holi: బుడ్డి మనవడితో సీఎం రేవంత్ రెడ్డి హోలీ వేడుకలు..

Holi 2024: సీఎం రేవంత్ రెడ్డి తన బుడ్డి మనవడితో హోలీ వేడుకలలో పాల్గొన్నారు.చిన్నారి మనవడితో సీఎం దంపతులు హోలీ ఆడుకుంటూ మురిసిపోయారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. 

1 /6

దేశ మంతాట హోలీ వేడుకలు అంబరాన్నితాకాయి. చిన్న పెద్ద తేడాలేకుండా ప్రజలంతా హోలీ వేడుకల్లో తడిసి ముద్దయ్యారు. ఇక సెలబ్రీటీలు, రాజకీయనాయకులు తమ హోలీ వేడుకలను ఫాన్స్, అభిమానుల మధ్యన జరుపుకున్నారు.

2 /6

ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన హోలీ వేడుకలను చిన్నారి మనవడితో కలిసి జరుపుకున్నారు. తన బుడ్డి మనవడికి రంగులు పూసి సీఎం దంపతులు ఎంతో మురిసిపోయారు.

3 /6

హోలీ వేడుకలను ప్రజలంతా ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా జరుపుకొవాలని తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోలీ పండుగ నేపథ్యంలో శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. దీంతో రెండు రోజులపాటు హోలీ సంబరాలు గ్రాండ్ గా జరిగాయి.

4 /6

దేశంలో ప్రస్తుతం ఎన్నికల్ హీట్ పీక్స్ కు చేరింది. అన్నిరాజకీయ పార్టీలు తమకు ప్రజలు పట్టం కట్టాలని వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

5 /6

ఇక హోలీ పండుగ నేపథ్యంలో రాజకీయనాయకులు ప్రజలతో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నరు. అనేక ప్రాంతాలలో బహిరంగంగా డీజేలు, డ్యాన్స్ లతో పొలిటిషియన్లు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.  

6 /6

ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత లు తమ మనవడితో హోలీ పండగను ఫుల్ జోష్ గా జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పీఎం, సీఎంలు అయిన మనవడికి మాత్రం తాతే కదా.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.