TS lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,ఏపీ సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు చెదురు మొదురు సంఘటనల మినహా దేశ వ్యాప్తంగా ప్రశాంతంగానే ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సామాన్యులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఎక్కడా ఓటెసినట్టు కనబడకపోవడం ఇపుడు చర్చీనీయాంశంగా మారింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ప్రభాస్ ఓటు వేసినట్టు ఎక్కడా కనిపించలేదు. బహుశా దేశంలో లేకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఎపుడు ఏ ఎన్నికలు జరిగినా.. ఉత్సాహాంగా ఓటు వేసే సీనియర్ హీరో నాగార్జున అక్కినేని ఎక్కడ ఓటు వేసిన జాడ కనబడలేదు.
నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కూడా ఎక్కడా ఓటు వేసినట్టు జాడ కనపడలేదు.
తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్లో తన వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఓటింగ్ సమయంలో వెంకీ జాడ ఎక్కడా లేదు. ఆయన ఓటు వేసినా లో ప్రొఫైల్ మెయింట్ చేసారా అనేది తెలియాల్సి ఉంది.
వెంకటేష్ అన్న కుమారుడు రానా దగ్గుబాటి కూడా ఈ ఎన్నికల్లో ఎక్కడా ఓటు వేసినట్టు కనబడలేదు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న రానా దగ్గుబాటి ఈ సారి ఈయన ఓటు వేసినట్టు ఎక్కడా కనబడలేదు.
నోటా, డియర్ కామ్రేడ్ వంటి పలు రాజకీయ కోణం ఉన్న సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కనబడలేదు.