Telangana Weather Update: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో పొడివాతావరణం, వడగాల్పులు..

Telangana Weather Update: తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి  గాలులు దక్షిణ,  నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు పొడివారణం ఉంటుందని తెలుస్తోంది. అనేక చోట్ల ఉష్ణోగ్రతలుకూడా క్రమంగా పెరుతాయని సమాచారం.

1 /5

కొన్నిరోజులుగా ఎండగలు దంచికొడుతున్నాయి. ప్రజలంతా ఉక్కపోతతో బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అవసరమైన తప్ప అస్సలు బైటకు వెళ్లకూడదని ఇప్పటికే నిపుణులు సైతం సూచనలు జారీచేశారు.  

2 /5

ఇక తెలంగాణాలో భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఉదయం పది అయ్యిందంటే చాలు.. ప్రజల్ని చెమటలు కక్కించేస్తున్నాడు.భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో చాలా మంది డీహైడ్రేషన్ ప్రభావానికి గురై, వడదెబ్బకు కూడా గురౌతున్నట్లు తెలుస్తోంది. 

3 /5

ఇదిలా ఉండగా.. రాగలమూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉండనుందో తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన జారీచేసింది. రాగల మూడు రోజుల్లో.. వేడిగా ఉంటు పొడివాతావణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా వేడిగాలులు వీస్తాయని తెలిపింది.  

4 /5

పొడితావరణంతో పాటు బలమైన వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ ఒకప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవరసమైతేనే బైటకు వెళ్లాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకొవాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.  

5 /5

ప్రజలు ముఖ్యంగా బైటకు వెళ్లినప్పుడు ఎక్కువగా నీళ్లను తాగడం, ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తీసుకొవడం, గొడుగు లేదా టోపీలను వాడాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి తీసుకొవాలంటూ కూడా నిపుణులు చెబుతున్నారు.