Sania Mirza: టెన్నీస్‌ అందాల తార సానియా మీర్జా ఇంటిని చూశారా.. కళ్లు చెదురుతాయ్‌

Sania Mirza Hyderabad House Images: భారత టెన్నీస్‌ తార సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలికి కొన్ని నెలలు గడిచింది. ఇటీవల భర్త వదిలేయడంతో సానియా వ్యక్తిగత జీవితంలో తీవ్ర అలజడి రేపింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. అయితే ఆమె ఇల్లు ఎలా ఉందనేది చర్చలోకి వచ్చింది. ఒకసారి ఆమె హోమ్‌ టూర్‌ చూద్దాం.

1 /10

భారత కీర్తి: భారత అగ్ర టెన్నీస్‌ తారల్లో సానియా మీర్జా ఒకరు. టెన్నీస్‌కు గుర్తింపు లేని సమయంలోనే భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించి అనేక విజయాలు పొంది భారత కీర్తిని ప్రపంచానికి చాటారు.

2 /10

ఇంటి ఫొటోలు వైరల్: కొన్ని నెలల కింద ఆటకు వీడ్కోలు సానియా మీర్జా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. ఆమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆమె ఇంటి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఇంటి వివరాలపై చర్చ జరుగుతోంది.

3 /10

అక్కడ.. ఇక్కడ: సానియాకు దుబాయ్‌తోపాటు హైదరాబాద్‌లో కూడా ఇల్లు ఉంది. రెండు చోట్ల కూడా ఆకుపచ్చ రంగులో ఇల్లు ఉండడం విశేషం.

4 /10

ఇంటి విలువ: హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌లో ఉన్న ఇంటి విలువ దాదాపు రూ.13 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. 

5 /10

విడాకులతో ఇక్కడే: పాకిస్థాన్‌ క్రికెటర్‌ సోయబ్‌ మాలిక్‌తో వివాహం అనంతరం ఈ ఇంట్లోనే సానియా కాపురం ఉన్నారు. అతడితో విడాకులైన కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నారు.

6 /10

సకల వసతులు: సకల సౌకర్యాలతో కలిగి ఉన్న ఈ ఇంటిలో తన కుటుంబంతో సానియా నివసిస్తున్నారు.

7 /10

ట్రోఫీలు, మెడల్స్: టెన్నిస్ టోర్నమెంట్లలో గెలుపొందిన మెడల్స్, ట్రోఫీలను తన ఇంటిలో ప్రత్యేకంగా సానియా ఉంచారు. అవి ఇంటికే అదనపు అందాన్ని తీసుకువస్తున్నాయి.

8 /10

ప్రత్యేక ఫర్నీచర్: సాంప్రదాయ రీతిలో ఇంట్లోని ఆర్కిటెక్చర్ ఉంది.  సానియా ఇంట్లో తల్లిదండ్రులతోపాటు ఇతరులు కూడా ఉంటారు. వింటేజ్ సంబంధమైన అనేక వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

9 /10

కుమారుడికి ప్రత్యేక గది: సానియా  మీర్జా కొడుకు ఇషాన్ కోసం ఒంటరిగా అలంకరించబడిన ఒక పిల్లల గది ఇంట్లో ఉంది. ఇక్కడ వారికి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి.

10 /10

సానియా మీర్జా గది ఇస్లామిక్ పద్ధతిలో ఉంటుంది. ప్రత్యేక వస్తువులతో అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.