Gold News: పసిడి ప్రియులకు షాక్.. బంగారం ధర రూ. 1 లక్ష దాటడం ఖాయం.. ఈ ఏడాదిలో ఎంత వరకూ పెరుగుతుందంటే ?

Gold Rate: పసిడి ధరలు అందుకోలేనంత వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధర తులం 1 లక్ష రూపాయలు అవుతోంది అనే వార్త మనకు వినిపిస్తోంది. ఇప్పుడు అది నిజం అవుతోంది. తులం బంగారం ధర 1 లక్ష రూపాయలు ఎప్పుడు దాటుతుందో తెలుసుకుందాం. 
 

1 /6

Gold Rate:  బంగారం ధర రాకెట్ కన్న వేగంగా దూసుకెళ్తోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ బంగారం ధర సామాన్యుడికి మాత్రం అందనంత ఎత్తుకు చేరుకుంటుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర ఈరోజు 79 వేల మార్కును దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 79 వేల రూపాయలు పైనే పలుకుతుంది.

2 /6

దీంతో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ సమయంలో బంగారం కొనుగోలు చేసే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మన దేశంలో బంగారు ఆభరణాలు ఎక్కువగా ధన త్రయోదశి సందర్భంగా కొనుగోలు చేస్తారు. బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం సైతం తొలిసారిగా చరిత్రలో 72 వేల రూపాయలు దాటింది. దీంతో అభరణాల మార్కెట్లో కలకలం మొదలైంది.   

3 /6

జూలై నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాలను భారీగా తగ్గించడంతో బంగారం ధర ఒకసారిగా 67 వేల రూపాయలకు పతనం అయ్యింది. ఈ లెక్కన చూస్తే బంగారం ధర గడచిన మూడు నెలల్లోనే ఏకంగా 12 వేల రూపాయలు పెరిగింది. బంగారం ధర గతంలో 75 వేల వద్ద ఆల్ టైం రికార్డ్ స్థాయిని స్థాపించింది. కానీ ఈ నెల ప్రారంభం నుంచి కూడా బంగారం ధర ఆల్ టైం రికార్డును దాటి వెళుతూ ఇప్పుడు ప్రస్తుతం 79 వేల రూపాయలకు చేరింది.   

4 /6

ఇక్కడ నుంచి బంగారం ధర మరికొన్ని రోజుల్లోనే 80 వేల రూపాయలకు చేరుతుంది. ఆ తర్వాత టార్గెట్ ఎంత అనే దాని పైన ప్రస్తుతం చర్చ మొదలైంది. బంగారం ధర ఎప్పటినుంచో ఊహిస్తున్నట్లుగానే ఒక లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సంవత్సరం చివరిలోగా లక్ష దాటుతుందా లేదా అనేది సందేహంగా మారింది. మరోవైపు బంగారం ధర డిసెంబర్ నాటికి 90000 నుంచి ఒక లక్ష రూపాయల మధ్యలో చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

5 /6

ప్రధానంగా అమెరికా మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్సుకు 2800-3000 డాలర్ల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని. ఇది కనుక జరిగితే బంగారం ధర లక్ష దాటడం చాలా సులభం అవుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం ఇప్పటిలో సమసి పోయేలా లేదు. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా స్టాక్ మార్కెట్ల పై ప్రభావం చూపే అవకాశం ఉంది.   

6 /6

ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడును బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది. ఫలితంగా అటు దేశీయంగాను బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇన్వెస్టర్లు ఆభరణాల ప్రియులకు బంగారం ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. వరుసగా బంగారం ధర పతనమయ్యే అవకాశం ఇప్పట్లో లేదని సూచిస్తున్నారు.