NutPowder: ఒక్క చెంచా ఈ పౌడర్ తీసుకుంటే చాలు..మెడనొప్పి నుంచి కాళ్లనొప్పుల వరకు పటాపంచల్

Nut Powder Health Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు,పప్పులు, చిరుధాన్యాలు ఇలా వీటిన్నింటిని డైట్లో చేర్చుకోవాలి. అయితే వీటితోపాటు ఈ పౌడర్ ను ఒక చెంచా తీసుకుంటే చాలు మెడనొప్పి నుంచి కాళ్లనొప్పుల వరకు..ఇతర సమస్యలన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పౌడర్ ఏంటి? ఎలా తీసుకోవాలి? తెలుసుకుందామా మరి. 

Nut Powder Health Benefits:నేటి బిజీలైఫ్ కారణంగా చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్దచూపించడం లేదు. కానీ ఆరోగ్యం అందరికీ ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రతిపనిని సక్రమంగా చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. 8గంటలు నిద్రపోవాలి. శారీరక శ్రమ తప్పనిసరి. ఇవన్నీ ఫాలో అవుతే మనం ఆరోగ్యంగా ఉంటాయి. అయితే పలు కారణాల వల్ల చాలా మంది చిన్నతనంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో వెన్నునొప్పి, మెడనొప్పి, కాళ్లనొప్పులు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఎన్ని మందులు వాడినా ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటి వారు ఈ పౌడర్ ఒక చెంచా తీసుకుంటే వెన్నునొప్పితోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ పౌడర్ ఏంటి..ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా?

1 /6

పల్లీలు:పల్లీలలో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో మోనోపాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయి. అంతేకాదు ఇందులోని విటమిన్స్ , మెగ్నీషియం, ఫాస్పరస్ కాపర్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి.   

2 /6

బెల్లం: చక్కెరతో పోల్చితే బెల్లం సహాజ స్వీటెనర్. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పోషకాల వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు సహాయం చేస్తాయి.   

3 /6

కొబ్బరి :కొబ్బరిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, మంచి కొవ్వులు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 

4 /6

నువ్వులు:నువ్వుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వుల్లో ఒమేగా 6, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్స్ బి, ఇలు పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటుగా కాల్షియం కూడా ఉంటుంది. 

5 /6

రెడ్ రైస్: నవారైస్ ను రెడ్ రైస్ అని కూడా పిలుస్తారు. నవరా వరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా ఉపయోగిస్తుంటారు. దీనిలో కాల్షియం, విటమిన్ బి, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.   

6 /6

ఎలా తయారు చేయాలి: ముందు బియ్యం, నువ్వులు, పల్లీలు వీడికా వేయించి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి అందులో బెల్లం, కొబ్బరి వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమం ఓ డబ్బాలో స్టోర్ చేసుకుని..రోజుకో చెంచా తీసుకోవాలి.