Zodiac predictions 2024: ఈ రాశుల వారికి జనవరి వరకు పట్టిందల్లా బంగారమే.. మీ రాశి కూడా ఉందా..?

Horoscope 2024: గ్రహాల మార్పు వల్ల.. ప్రస్తుతం నుంచి వచ్చే సంవత్సరం జనవరి వరకు.. ఐదు రాశుల వారికి దశ తిరిగింది. వీరి పట్టిందల్లా బంగారం కావోస్తోంది. మరి ఆ ఐదు రాశులు ఏవో ఒకసారి చూద్దాం.
 

1 /8

గ్రహాల గమనం మీద వేద జ్యోతిష్య శాస్త్రం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గ్రహాలు స్థానం మారడం వల్ల ద్వాదశ రాశుల వారి జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వృషభ రాశిలో గురు సంచారం జరుగుతుంది.. వృశ్చిక రాశిలో ఉన్న బుధుడితో వృషభ రాశిలో ఉన్న గురువు సంచారం కారణంగా ఈ రెండు గ్రహాల మధ్య సంసప్తక దృష్టి ఏర్పడుతుంది. ఇక వీటి ప్రభావం కలిగిన రాశుల వారికి  జనవరి 4వ తేదీ వరకు పట్టిందల్లా బంగారమే. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

2 /8

గురుడు, బుధుడు కలయిక వల్ల వృషభ రాశి వాళ్లుకు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో కలిసి వస్తుంది. ఆర్థికంగా ఇది మీకు తిరుగులేని సమయం. ఉద్యోగాలు చేసే వారికి కూడా శుభ సమయం అని చెప్పాలి. ఆదాయం పెరుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. 

3 /8

ఈ రాశి వారికి ఆర్థిక లబ్ది జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఉద్యోగం చేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో సంతోషంగా కూడా ఉంటారు. 

4 /8

ఈ రాశుల కలయిక వల్ల సింహరాశి వారికి రాజయోగం సిద్ధిస్తుంది. సింహ రాశి వారు ఈ సమయంలో ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం కూడా ఇదే. 

5 /8

వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు ఉద్యోగంలో విజయాల సాధిస్తారు.  ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది. పెళ్లి కాని వారికి వివాహయోగం కనిపిస్తోంది. 

6 /8

ఈ రాశుల వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి వర్తక,  వ్యాపారాలలో ఊహించని పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.   

7 /8

ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతి ఉంటుంది.  ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీన రాశి వారికి శుభ సమయం,  ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. 

8 /8

ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు, అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే రూపొందించబడింది. దీనిని జీ న్యూస్ ధృవీకరించలేదు.