Snake Alert at Monsoon: వర్షాకాలంలో పాముల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో.. మనం ఇంట్లో వచ్చే వాసన ద్వారా పాము వచ్చినట్టు గుర్తించవచ్చు.
వర్షాకాలం వచ్చింది అంటే పరుపులతో పాటు పాముల బెడద కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ అందులో విషపూరితమైన పాము మన ఇంట్లోకి వస్తే తెలుసుకోవడం ఎలా అని చాలా మందికి సందేహం ఉంటుంది.
కానీ మన ముక్కుతో మన ఇంట్లో ఉన్న జంతువులను కూడా మనం ఇట్టే పసిగట్టవచ్చు అని మీకు తెలుసా? మన ఇంట్లో కుక్క, పిల్లి లాగానే ఇంకేమైనా జంతువు వచ్చినా కూడా మనకి వాసనతో తెలుస్తుంది.
బెస్ట్ లైఫ్ అనే ఒక వెబ్ సైట్ లో.. ఎలి హోగన్ అనే ఒక రైటర్ దీని గురించి రిపోర్టర్ రాశారు. చాలా వరకు వచ్చినప్పుడు మనకి వాసన వచ్చే ముందే అది మనకి కనిపించేస్తుంది.
విషపూరితమైన పాముల వాసన.. కీరా దోసకాయ వాసన లాగా ఉంటుందట. పాము తోక లో ఉండే ఒక గ్లాండ్ కారణంగా ఈ వాసన వస్తుందట.
రాటిల్ పాములు కూడా కీర దోసకాయ.. వాసనే వస్తాయట. ముఖ్యంగా వర్షాకాలంలో సడన్ గా ఇంట్లో ఇలాంటి.. వాసన వచ్చినప్పుడు మనం అప్రమత్తం అవ్వాలి.
వర్షాకాలంలో వచ్చే పురుగుల కారణంగా పాములు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అలాగే కీరా దోసకాయ వాసన.. వస్తే మన ఇంట్లో పాము దాక్కున్నట్టే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పాములు భయపడినప్పుడు కూడా ఒక రకమైన వాసన వస్తాయట. దాన్ని బట్టి. కూడా మనం ఇంట్లోకి పాము వచ్చినట్లు గుర్తించవచ్చు.