Hit Combinations: హిట్ కాంబినేషన్స్ రిపీట్ చేస్తున్న స్టార్ హీరోలు..

Hit Combinations: సినీ ఇండస్ట్రీలో కథ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒక హీరో, డైరెక్టర్ కాంబోలో ఓ సినిమా హిట్ అయితే వెంటనే ఆ కాంబోలో పలు సినిమాలు నిర్మించడానికి ప్రొడ్యూసర్ క్యూ కడుతున్నారు.

 

1 /13

ఎన్టీఆర్, ప్రభాస్, బాలయ్య, నాని, రామ్ చరణ్  సహా చాలా మంది హీరోలు తమకు గతంలో సక్సెస్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

2 /13

బాలకృష్ణ - బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో  సింహా, లెజెండ్, అఖండ వంటి హాట్రిక్ హిట్స్ టాలీవుడ్ లో సరికొత్త సెన్సెషన్ క్రియేట్ చేసాయి. ఇపుడు వీళ్ల కలయికలో అఖండ 2 రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు 16వ తేదిన ప్రారంభం కానుంది.

3 /13

నాని - శ్రీకాంత్ ఓదేల నాని, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ లో వచ్చిన ‘దసరా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వీళ్ల కాంబినేషన్ లో మరో సినిమా దసరా కానుకగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

4 /13

అల్లు అర్జున్ - సుకుమార్.. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య2, పుష్ప వంటి సినిమాలు వచ్చాయి. అందులో ఆర్య 2 మాత్రమే సక్సెస్ కాలేదు. మిగతా సినిమాలన్ని హిట్ అనిపించుకున్నాయి. ఇపుడు వీళ్ల కాంబినేషన్‌లో పుష్ప 2 ది రూల్ రాబోతుంది. డిసెంబర్ 6న సినిమా విడుదల కాబోతుంది.

5 /13

ఎన్టీఆర్ - కొరటాల శివ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో  'జనతా గ్యారేజ్' తాజాగా ‘దేవర పార్ట్ -1’ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక వీళ్ల కాంబినేషన్ లో ‘దేవర పార్ట్ -2’ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 2026లో ఈ సినిమా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

6 /13

వెంకటేష్ - అనిల్ రావిపూడి వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు తెరకెక్కాయి. ఇపుడు మూడో సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాము’ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

7 /13

ప్రభాస్ - ప్రశాంత్ నీల్.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సలార్ సీజ్ ఫైర్ పార్ట్ -1' బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇపుడీ కాంబినేషన్‌లో 'సలార్ - 2 శౌర్యంగ పర్వం' రాబోతుంది. వచ్చే యేడాది ఈ సినిమా విడుదల చేయనున్నట్టు చెప్పారు.

8 /13

ప్రభాస్ - నాగ్ అశ్విన్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2898 AD’ సినిమా ఈ యేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇపుడీ కాంబినేషన్ లో రాబోయే సీక్వెల్ 2026లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.  

9 /13

రామ్ చరణ్ - సుకుమార్.. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో మరో సినిమాను అనౌన్స్ చేశారు.  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. బుచ్చిబాబు సినిమా తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

10 /13

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్.. గబ్బర్ సింగ్ వంటి హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రాబోతుంది. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా అసలు తెరకెక్కుతుందా లేదా అనేది చూడాలి.

11 /13

రవితేజ - గోపిచంద్ మలినేని రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత ఇపుడు మరోసారి ఈ కాంబినేషన్‌కు రంగం సిద్ధం అయింది.

12 /13

అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను.. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'సరైనోడు' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు వీళ్ల కాంబోలో సినిమా బాలయ్య, బోయపాటి సినిమా తర్వాత పట్టాలెక్కనుంది. 

13 /13

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. వీళ్ల కాంబోలో  నాల్గో సినిమా ప్రకటించారు. డిసెంబర్ లో ఈ సినిమా  సెట్స్ పైకి వెళ్లనుంది.