Ugadi New Year 2023: ఇవాళ చైత్ర శుక్ర ప్రతిపద నుంచి హిందూమతం కొత్త ఏడాది ప్రారంభం కానుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది 2080వ సంవత్సరం. బుధవారం నాడు కొత్త ఏడాది ప్రారంభ ఉగాది పండుగ. బుధుడిిన రాజకుమారుడిగా, కళ్యాణ దేవతగా భావిస్తున్నందున కొత్త ఏడాది తొలిరోజు బుధవారం నాడు మూడు ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. అవి నవపంచమి, గజకేసరి, బుధాదిత్య రాజయోగం. ఇవాళ మీనరాశిలో గురుడు, బుధుడు, సూర్యుడు, చంద్రుడు కలయిక ఉంటుంది. పలితంగా 5 రాశులపై తీవ్ర ప్రభావముంటుంది. ఈ 5 రాశులకు ఆర్ధిక ఇబ్బందులు, వ్యాధులు, కెరీర్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
వృషభ రాశి ఈ రాశివారికి పనిచేసే చోట సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. టార్గెట్ పూర్తికాకపోవడం వల్ల యజమాని ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. సహచరుల్నించి వివాదం ఏర్పడవచ్చు. ఖర్చుల్ని నియంత్రించుకోకపోతే ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి.
వృశ్చిక రాశి ఏదైనా కాగితాలపై సంతకాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆ కాగితాల్ని జాగ్రత్తగా చదవాలి. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు ఎదురుకావచ్చు. సహచరులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి.
మకర రాశి వ్యాపారులు ఎక్కడైనా ఎందులోనైనా పెట్టుబడి పెట్టేముందు ఆ రంగం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎక్కువ లాభాలకు ఆశపడి ఒకేసారి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టవద్దు. ఏదైనా నిర్ణయం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. నెగెటివ్ ప్రభావం పడవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఎదైనా రుగ్మత ఏర్పడవచ్చు. బయటి తిండి తినవద్దు.
మేష రాశి మేష రాశి జాతకులు రిస్క్‌తో కూడుకున్న పెట్టుబడుల్నించి దూరంగా ఉండాలి. వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునేముందు పూర్తిగా ఆలోచించుకోవాలి. మీ నిర్ణయం హాని కల్గించవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. తిండి విషయంలో జాగ్రత్తలు అవసరం.
కుంభ రాశి సొంత ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు లోన్ విషయంలో ఆలోచించవచ్చు కానీ ఆ అప్పు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ అప్పు విషయంలో చిక్కుకుపోతారు. కుటుంబంలో వివాదాలు రావచ్చు. ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది.